పల్నాడుకు అనుమతులిచ్చింది బీఆర్ఎస్సే
ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ పథకానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే రాష్ట్రానికి నీటి వాటా విషయంలో అన్యా యం జరిగిందంటూ బుకాయించారు.
- గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే అన్యాయం
- గతంలో కంటే ఎక్కువ నీళ్లనే వాడినం
- విలేకరులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- కేసీఆర్, హరీశ్‌రావుపై తప్పడు ఆరోపణలు
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ పథకానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే రాష్ట్రానికి నీటి వాటా విషయంలో అన్యా యం జరిగిందంటూ బుకాయించారు. సచివాలయంలో సహచర మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి సోమవారం సాయంత్రం ప్రత్యేకంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. పల్నాడు వాటర్ గ్రిడ్ విషయం, కృష్ణా జలాల అంశాలపై మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌పై తప్పుడు ఆరోపణలు చేశారు.
2022లోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు 2022లో అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ హయాంలోనే జీవో 56 విడుదలైందని, కేంద్రం నుంచి రూ.500 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ వచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారని తెలిపారు. అయినప్పటికీ నాడు కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదన్నారు. ఆ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామని, పనులు నిలిపివేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారని వెల్లడించారు.
2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో టీఆర్ఎస్కు చెందిన ఆరుగురు మంత్రులుగా ఉన్నారని, అప్పుడే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11వేల క్యూసెకుల నుంచి 44వేల క్యూసెకులకు పెంచేందుకు అనుమతులిచ్చారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణా జలాల పంపకాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోయిందని, ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీల నీటి కేటాయింపులకు అంగీకరించారని బురదజల్లే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదని, కేసీఆర్ హయాం లో ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులు పూర్తికాలేదని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

