బీన్స్ కేర్‌ఫుల్!
రాజ్మా, శెనగలు, సోయాబీన్, పెసర్లు, అలసందలు వంటి బీన్స్.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొక్కల ఆధారిత ప్రొటీన్, ఫైబర్, ఐరన్, ఫోలేట్, పొటాషియం లాంటి మరెన్నో ప్రయోజనాలు అందిస్తాయి.అయితే, బీన్స్ తిన్న తర్వాత చాలామందిలో గ్యాస్, ఉబ్బరం, కడుపులో అసౌకర్యం లాంటి సమస్యలు కనిస్తాయి. ‘బీన్స్'ను తినడానికి సిద్ధం చేసుకోవడంలో లోపాలే ఇందుకు కారణమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
రాజ్మా, శెనగలు, సోయాబీన్, పెసర్లు, అలసందలు వంటి బీన్స్.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొక్కల ఆధారిత ప్రొటీన్, ఫైబర్, ఐరన్, ఫోలేట్, పొటాషియం లాంటి మరెన్నో ప్రయోజనాలు అందిస్తాయి.అయితే, బీన్స్ తిన్న తర్వాత చాలామందిలో గ్యాస్, ఉబ్బరం, కడుపులో అసౌకర్యం లాంటి సమస్యలు కనిస్తాయి. ‘బీన్స్’ను తినడానికి సిద్ధం చేసుకోవడంలో లోపాలే ఇందుకు కారణమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ బీన్స్ తినాలనుకునేవారు కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.
ఒకేసారి పెద్ద మొత్తంలో బీన్స్ తింటే.. జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. బీన్స్‌లో ఉండే ఫైబర్, ‘ఆలిగోశాకరైడ్స్’ అనే కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడానికి మన పేగుల్లోని బ్యాక్టీరియాకు కొంత సమయం, అలవాటు అవసరం. కాబట్టి, చిన్న పరిమాణంతోనే బీన్స్‌ను తినడం ప్రారంభించాలి. రోజుకు పావు కప్పు లేదా అర కప్పు తీసుకుంటూ.. శరీరం అలవాటు పడేకొద్దీ క్రమంగా పరిమాణాన్ని పెంచుకోవాలి. అంతేకాకుండా, ఫైబర్ ఎక్కువగా ఉండే బీన్స్ తీసుకుంటున్నప్పుడు తగినంత నీరు తాగడం కూడా చాలా అవసరం. నీరు తక్కువగా తాగితే మలబద్ధకం లేదా కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం ఉంటుంది.
బీన్స్‌ను సరిగ్గా సిద్ధం చేయకుండా వండితే జీర్ణం కావడం కష్టమవుతుంది. అంతేకాదు, కొన్ని రకాల బీన్స్ సరిగ్గా ఉడకకపోతే అందులోని సహజ సమ్మేళనాలు కడుపులో ఇబ్బంది కలిగిస్తాయి కూడా. కాబట్టి, ఎండిన బీన్స్‌ను వండటానికి కనీసం 6 నుంచి 8 గంటలు (లేదా రాత్రంతా) నీటిలో నానబెట్టాలి. నీటిని పారబోసి, తాజా నీటితో కడిగి వండటం వల్ల జీర్ణానికి ఆటంకం కలిగించే కొన్ని అంశాలు తగ్గుతాయి. బీన్స్ మెత్తగా ఉడికేలా జాగ్రత్తపడాలి. బీన్స్‌కు జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఇంగువ వంటి సుగంధ ద్రవ్యాలు చేర్చి వండటం వల్ల జీర్ణక్రియ మరింత సులభమవుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

