రాజ్మా.. వీటినే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. చూసేందుకు అచ్చం ఇవి కిడ్నీల మాదిరిగానే ఉంటాయి. కనుకనే ఈ బీన్స్‌ను ఆ పేరుతో పిలుస్తారు. రాజ్మాను ఎక్కువగా ఉత్తరాదికి చెందిన వారు తింటారు.
రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ ప్రొటీన్‌కు పవర్ హౌస్ కాకుండా వీటిలో మినరల్స్, విటమిన్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో అధిక బరువును నియంత్రించడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.