Vijay Devarakonda : టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్నా(Rashimika Mandanna)లు తమ వివాహ ఫొటోలు పంచుకున్నారు. సన్నిహితుల సమక్షంలో సంబురంగా జరిగిన తమ డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోలను ఇరువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘గీత గోవిందం’ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఆ చిత్రంలో మాదిరిగానే నిజజీవితంలోనూ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట.. ఎట్టకేలకు ఇటీవలే ‘మేము ఒక్కటి కాబోతున్నాం’ అని ప్రకటించింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26 ఉదయం 10.10 గంటలకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందీ స్టార్ కపుల్. కొద్దిమంది ఆహ్వానితులు, సన్నిహితుల సమక్షంలో సందడిగా సాగిన తమ విరోష్ కల్యాణ వేడుక ఫోటోలను విజయ్, రష్మికలు ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
‘ఒకరోజు నేను తనను మిస్ అయ్యాను. తను పక్కన ఉంటే నా రోజంతా గొప్పగా మారుతుంది. తను నా పక్కన కూర్చుంటే నా భోజనం సంతృప్తిగా అనిపిస్తుంది. తను నాతో కలిసి వర్కవుట్లు చేస్తుంటే అవి శిక్షలా కాకుండా ఎంతో ఫన్నీగా అనిపిస్తాయి. తను నాకు చాలా అవసరం. నేను ఎక్కడ ఉన్నా సరే తను పక్కన ఉంటే ఇంట్లో ఉన్నట్టుగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో.. నా బెస్ట్ ఫ్రెండ్‌ను నా భార్యగా చేసుకున్నా’ అని విజయ్ దేవరకొండ ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
One day, I missed her.
Missed her in a way that made me feel like my day would’ve been better if she were around.
Like my meals would’ve felt more wholesome if she were sitting across from me.
Like my workouts would’ve been more fun and less of a punishment if she were doing… pic.twitter.com/fy7umfHWjN— Vijay Deverakonda (@TheDeverakonda) February 26, 2026