న్యూఢిల్లీ : రుచిలో మేటి..ఆరోగ్యానికి సాటిరాని రాజ్మా చావల్‌ను అందరూ ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. ఈ ఫేమస్ పంజాబీ డిష్‌ను పిల్లలు, పెద్దలు అమితంగా ఇష్టపడతారు. రోటీలో ఈ డిష్‌ను ప్రత్యేకంగా భావిస్తుంటారు. ఈ వంటకంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ ప్రొటీన్‌కు పవర్ హౌస్ కాకుండా వీటిలో మినరల్స్, విటమిన్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో అధిక బరువును నియంత్రించడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అధిక బరువు, ఊబకాయం ఎన్నో అనారోగ్యాలకు దారితీస్తాయి. రాజ్మాలో ఉండే డైటరీ ఫైబర్ కడుపు నిండిన భావన కలుగుచేయడంతో అదేపనిగా తినడం నిలిపివేస్తారు. దీంతో పాటు బీన్స్ త్వరగా అరగడంతో జీవక్రియల వేగం పెరిగి బరుగు తగ్గుతారు. రాజ్మాలో పుష్కలంగా ఉండే పొటాషియంతో కడుపుబ్బరం, వికారం వంటి ఇబ్బందులనూ అధిగమించవచ్చు.
రాజ్మా ఇతర బీన్స్ రకాలు తరచూ తీసుకుంటే క్యాన్సర్ ముప్పునూ తగ్గించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయి. రాజ్మాతో పాటు బీన్స్‌లో ఉండే పోషకాలు, ఫైబర్లు క్యాన్సర్ వ్యతిరేక కారకాలుగా పనిచేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.