మా పాలనలోనే అత్యధికంగా ‘కృష్ణా’ వినియోగం
బీఆర్ఎస్ పాలనలోనే అత్యధికంగా కృష్ణా జలాలను వినియోగించుకున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు స్పష్టంచేశారు.
- తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్సే
- సీఎం అతితె లివితేటలు.. పచ్చి అబద్ధాలు
- బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పాలనలోనే అత్యధికంగా కృష్ణా జలాలను వినియోగించుకున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు స్పష్టంచేశారు. నాడైనా నేడైనా తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్నటి ప్రెస్మీట్లో అతితెలివితేటలు ప్రదర్శించి, పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవపట్టించారని మండిపడ్డారు. సోమవారం రాత్రి ఓ న్యూస్ చానల్ చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు.
మంగళవారం అన్ని వివరాలు, ఆధారాలను ప్రజల ముందు ఉంచి రేవంత్‌రెడ్డి నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తానని ప్రకటించారు. 2016-17లో అత్యధికంగా కృష్ణాలో 45.5% వినియోగించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. 2024-25లో 28%, 2025-26లో కేవలం 25% నీళ్లు వాడుకున్నారని పేర్కొన్నారు. కానీ, 132 టీఎంసీలు వాడుకున్నట్టు చెప్పడం సత్యదూరమని కొట్టిపారేశారు. సీఎం చెప్పిందే నిజమైతే అంతమేర పంట ఎందుకు పండలేదు? నాగర్జునసాగర్ కింద ఆయకట్టుకు క్రాప్‌హాలిడే ఎందుకిచ్చారని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

