సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పోలీస్స్టేషన్లలో నమోదవుతున్న కేసులు కొందరు పోలీసులకు కాసులు కురిపిస్తున్నాయి. కేసు తీవ్రతను బట్టి రేటు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కమిషనరేట్‌లో చర్చ జరుగుతున్నది. నగరంలోని
శాంతిభద్రతలు, సీసీఎస్, ట్రాఫిక్ విభాగాల్లో పనిచేస్తున్న కొందరు ఇన్స్పెక్టర్లు తీరు వివాదాస్పదంగా మారుతున్నది. ఒక్కొక్కరూ
సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పోలీస్స్టేషన్లలో నమోదవుతున్న కేసులు కొందరు పోలీసులకు కాసులు కురిపిస్తున్నాయి. కేసు తీవ్రతను బట్టి రేటు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కమిషనరేట్‌లో చర్చ జరుగుతున్నది. నగరంలోని
శాంతిభద్రతలు, సీసీఎస్, ట్రాఫిక్ విభాగాల్లో పనిచేస్తున్న కొందరు ఇన్స్పెక్టర్లు తీరు వివాదాస్పదంగా మారుతున్నది. ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో ఫిర్యాదుదారులను ఇబ్బంది పెడుతూ.. తమ జేబులు నింపుకొంటున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీబీకి పట్టుబడినా, మూడు నెలల్లో కొందరు
పోలీస్ అధికారులు చేసిన అక్రమాలపై సీపీ సజ్జనార్ సీరియస్ అయి వారిపై వేటు వేయడంతోపాటు కొందరికి హెచ్చరికలు జారీ చేశారు. ఇదంతా జరుగుతున్నా.. కొందరు అధికారులు మాత్రం మారడం లేదు.
నాగార్జునసాగర్ హైవేకు, శ్రీశైలంహైవేకు సమీపంలో ఉన్న ఆ పోలీస్‌స్టేషన్ ప్రముఖ దుకాణాసముదాయాలకు ప్రసిద్ధికెక్కింది. ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. గత సంవత్సరం నవంబర్‌లో ఓ మైనర్ డ్రైవింగ్‌తో గుర్తుతెలియని వ్యక్తి మరణించాడు. ఆ ఘటనలో మైనర్‌తో పాటు కారు ఓనర్ అయిన అతడి తల్లిదండ్రులను రిమాండ్ చేస్తామని పోలీసులు బెదిరించి రెండు లక్షల రూపాయలను తీసుకున్నారు. ఓ హత్య కేసులో పదిమంది నిందితుల్లో ఏడుగురిని తప్పించడానికి పదిలక్షలు తీసుకున్నారని పోలీసులే చెబుతున్నారు. ఓ ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిని పది మంది వ్యక్తులు తీవ్రంగా కొట్టి గాయపరచగా, ముందుగా అతడిని ఒవైసీ హాస్పిటల్‌కు తరలించి ఆ తర్వాత ఉస్మానియాకు పంపించగా.. అక్కడ పదిహేనురోజుల పాటు చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఈ కేసులో ముగ్గురిని రిమాండ్‌కు తరలించి మిగతావారిని తప్పించిన నేపథ్యంలో మొదటి నుంచి చివరవరకు 15లక్షల రూపాయలు తీసుకున్నట్లు పీఎస్‌లో చర్చ జరుగుతున్నది. మరో ఘటన అసలు పోలీసులంతా ఆత్మైస్థెర్యాన్ని కోల్పోయిన పరిస్థితి.. డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతారనడానికి నిదర్శనంగా నిలిచింది. స్టేషన్ పరిధిలో ఓ గ్రౌండ్లో గంజాయి సేవించిన వ్యక్తులు వారిని పట్టుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై దాడిచేయగా, అతను గాయపడ్డారు. వారిని స్టేషన్‌కు తరలించగా అక్కడ సదరు ఇన్స్పెక్టర్పై కూడా వారు దాడి చేయడంతో పోలీసులంతా ఆ ఇద్దరు గంజాయి బ్యాచ్‌ను శిక్షించాలంటూ పట్టుబట్టారు. కానీ స్టేషన్ అధికారి మాత్రం రెండులక్షల బేరానికి వారిపై ఎలాంటి కేసు పెట్టకుండా వదిలేశారు.
తన పరిధిలో కొన్ని దుకాణాల నుంచి నెలవారీ మామూళ్లు తప్పనిసరిగా రావాలని లేకుంటే వారిని ఏదో ఒక కేసులో ఇరికించి తిరిగి వారితో బేరాలాడుతారంటూ స్థానికంగా చర్చ జరుగుతున్నది. ఓ స్థల వివాదంలో తలదూర్చి అక్కడ రౌడీషీటర్లతో కలిసి అమాయకులను బెదిరించి పదిలక్షలు తీసుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా తన దగ్గరకు వచ్చిన చిన్న నుంచి పెద్ద కేసు ఏదైనా సరే.. తాను ఒక్కడే సింగిల్‌గా సెటిల్మెంట్ చేసుకుంటారని, ఈయనకు పై అధికారి అండదండలు ఉన్నాయంటూ స్థానికంగా చెప్పుకొంటున్నారు.
బంగారం బజార్‌గా చెప్పుకొనే పాతబస్తీలోని ఓ స్టేషన్ ఉన్నతాధికారి చూపు బంగారంపై పడింది. ఇటీవల పెరిగిన బంగారం ధర ల కారణంగా ఆశ పెంచుకున్న ఆ అధికారి తనకు సహకరించాలంటూనే తన పై అధికారితో చెప్పి ఆయన సహకారంతో తన పరిధిలో జరుగుతున్న బంగారు లావాదేవీలపై
దృష్టిపెట్టారు. ఆ బజార్లో బంగారు ఆభరణా ల తయారీదారులే ఎక్కువగా ఉండడం, వార ంతా జీరో బిల్లుతో సరుకు తయారు చేయించడంతో ఎప్పటికప్పుడు వారిని టార్గెట్‌గా తమ జేబులు నింపుకొనే ప్రయత్నం చేశారు.
సాధారణంగా వచ్చే మామూళ్లు కాకుండా ఈసారి పెద్ద మొత్తంలో వసూలు
చేయాలనుకున్న ఆ ఉన్నతాధికారి స్మగ్లింగ్ బంగారంతో వ్యాపారం చేస్తున్నారంటూ బేరసారాలు ప్రా రంభించాడు. ఇటీవల సీపీని కలిసిన కొందరు బంగారు వ్యాపారులు సదరు పోలీసు అధికారిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆ ఇన్స్పెక్టర్ కేసుల తీవ్రతను బట్టి వసూళ్ల బాధ్యతలను తనకు అనుకూలమైన ఒక
కానిస్టేబుల్‌కు అప్పగించాడు. అతను నగలు తయారు చేసి తీసుకెళ్తున్న వాహనాలను ఆపి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసి తమ ఇన్స్పెక్టర్ ద్వారా ఆ పై అధికారికి కూడా వాటాలు పంచినట్లు స్టేషన్లో చెప్పుకొంటున్నారు.
బంగారు ఆభరణాలు తయా రు చేయించే నగల వ్యాపారులు ఆ స్టేషన్ అధికారులతో
ఎప్పటికప్పుడు లావాదేవీలు చేయడం సాధారణంగా జరుగుతున్నప్పటికీ ఈ ఇన్స్పెక్టర్కు ఆశ పెరగడంతో వారంతా లబోదిబోమంటున్నారు. తమ దగ్గర బంగారం తీసుకొని ఆభరణాలు చేసే వారు కొందరు పారిపోతే స్టేషన్ అధికారులతో మాట్లాడి రెండింటికి ఒకటి చొప్పున సెటిల్మెంట్ చేసుకున్నారని ఆ స్టేషన్
పరిధిలో స్థానికులు మాట్లాడుకుంటున్నారు.
హైదరాబాద్ ఐకాన్‌గా చెప్పే ఆ ప్రాంతానికి సంబంధించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. న్యాయం చెప్పే చోటుకు సమీపంలో ఉన్న చిరు వ్యాపారులే టార్గెట్‌గా ప్రతీనెలా 6.5 లక్షలు లెక్క ప్రకారం వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన మాట వినని
తీయని వ్యాపారుల వద్ద నుంచి సిలిండర్లు తీసుకుని వచ్చి వారు మళ్లీ స్టేషన్‌కు వచ్చి తమ సిలిండర్లు తమకు ఇవ్వాలని అడిగితే మునుపటి కంటే ఎక్కువ డిమాండ్ చేస్తూ వేలకు వేలు దండుకుంటున్నారట. టిఫిన్ సెంటర్లయితే పదివేలు, టీకొట్టు అయితే ఐదువేలు, కొబ్బరిబొండాలు పదివేలు, స్వీట్‌షాపులు
పదిహేను వేలు.. ఇలా షాపునకు ఒక రేటు కట్టి ప్రతీనెలా మామూళ్లు వసూలు చేస్తున్నారు. అయితే గతంలో మూడున్నర లక్షలే వసూలు అవుతుండగా, ఇప్పుడు ఆరున్నర లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
అయితే తమపై ఎవరైనా ఆరోపణలు చేస్తే చాలు.. ఆ ఇన్స్పెక్టర్ సిబ్బందితో సహా ఆయా
వ్యాపారాల వద్దకు వెళ్లి తమ ఖాతా సెటిల్ చేయాలని, లేకపోతే సామాన్లు సర్దుకుని పోవాలంటూ.. బెదిరిస్తున్నట్లు స్థానికంగా చెప్పుకొంటున్నారు. ఎన్నో ఏండ్లుగా జరుగుతున్న ఈ వ్యాపారాల విషయంలో వారిపై ఈ ఇన్స్పెక్టర్ చేస్తున్న జులుంతో వారంతా అడిగినంత సమర్పించుకుంటున్నారు. రోడ్లపై
ట్రాఫిక్‌జామ్‌కు వీరు కారణమంటూ వస్తున్న ఫిర్యాదులంటూ సాకులు చూపిస్తున్నప్పటికీ దానివెనక కారణం ముడుపులేనని తెలుస్తున్నది.