Girl Visits Jail To Meet Lover | ప్రియుడ్ని కలిసేందుకు తూటాలతో జైలుకు వెళ్లిన బాలిక.. తర్వాత ఏం జరిగిందంటే?
Girl Visits Jail To Meet Lover | ఒక బాలిక తన ప్రియుడ్ని కలిసేందుకు జైలు వద్దకు చేరుకున్నది. నకిలీ ఆధార్ కార్డ్ సమర్పించింది. చెకింగ్ సమయంలో ఆమె జేబులో పది లైవ్ బుల్లెట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ఆ బాలికతో పాటు ఆమె వెంట ఉన్న వ్యక్తిని జైలు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
లక్నో: ఒక బాలిక తన ప్రియుడ్ని కలిసేందుకు జైలు వద్దకు చేరుకున్నది. నకిలీ ఆధార్ కార్డ్ సమర్పించింది. చెకింగ్ సమయంలో ఆమె జేబులో పది లైవ్ బుల్లెట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ఆ బాలికతో పాటు ఆమె వెంట ఉన్న వ్యక్తిని జైలు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. (Girl Visits Jail To Meet Lover) ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రియుడైన హర్షు కశ్యప్ అనే ఖైదీని కలిసేందుకు మైనర్ బాలిక మరో వ్యక్తితో కలిసి గోండాలోని డివిజనల్ జైలుకు చేరుకున్నది.
కాగా, జైలు ప్రధాన ద్వారం వద్ద భద్రతా తనిఖీ సమయంలో ఆ బాలిక తప్పుడు వివరాలు చెప్పింది. ఆధార్ కార్డులో ఉన్న పేరుకు భిన్నంగా ఆమె పేరు చెప్పింది. అనుమానించిన జైలు సిబ్బంది ఆ బాలికను తనిఖీ చేశారు. ఆమె జేబులో పది లైవ్ కార్ట్రిడ్జ్లు ఉండటం చూసి షాక్ అయ్యారు. ఆ బుల్లెట్లు, నకిలీ ఆధార్ కార్డుతో పాటు ఆమె వద్ద ఉన్న కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలికతో పాటు ఆమె వెంట ఉన్న వ్యక్తిని జైలు అవుట్‌పోస్ట్ ఇన్ఛార్జ్కు అప్పగించారు.
మరోవైపు విచారణ సమయంలో ఆ బాలిక తన అసలు వివరాలు వెల్లడించింది. తన వద్ద లభించిన తూటాలు తన తండ్రికి చెందిన లైసెన్స్ పిస్టల్‌కు సంబంధించినవని చెప్పింది. తన తండ్రికి కోపం ఎక్కువని, జైలులో ఉన్న తన ప్రియుడిని కలవడానికి వెళ్లిన విషయం తెలిస్తే తనను ఏమైనా చేయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ఆ తూటాలను పిస్టల్ నుంచి తీసి తనతో పాటు తీసుకువచ్చినట్లు ఆ యువతి వివరించింది. అయితే ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జైలు అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

