Abhishek Sharma | టీ20ల్లో అభిషేక్ సునామీ.. వేగవంతమైన శతకంతో చరిత్రకెక్కిన ఓపెనర్..!
Abhishek Sharma : భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) టీ20ల్లో మరోసారితన ఉగ్రరూపాన్ని చూపించాడు. అఫ్గనిస్థాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో సునామీలా విరుచుకుపడిన అభిషేక్ 30 బంతుల్లోనే శతకం సాధించాడు.
Abhishek Sharma : భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) టీ20ల్లో మరోసారితన ఉగ్రరూపాన్ని చూపించాడు. అఫ్గనిస్థాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో సునామీలా విరుచుకుపడిన అభిషేక్ 30 బంతుల్లోనే శతకం సాధించాడు. పొట్టి క్రికెట్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీతో చరిత్ర సృష్టించాడీ చిచ్చరపిడుగు. అంతర్జాతీయంగా చూస్తే.. మూడో ఫాస్టెస్ట్ సెంచరీ మనోడిదే. 99 వద్ద సింగిల్ తీసి.. టీ20ల్లో మూడోసారి మూడంకెల స్కోరందుకున్నాడు అభిషేక్.
టీ20ల్లో విధ్వంసక ఆటకు కేరాఫైన అభిషేక్ శర్మ మరో మైలురాయిని అందుకున్నాడు. నామమాత్రమైన మూడో మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ 16 బంతుల్లోనే యాభై రన్స్ బాదిన అతడు.. మరో 14 బంతుల్లోనే శతకం సాధించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో మూడో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు అభిషేక్.
అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతమైన సెంచరీ వీరుల జాబితాలో సహిల్ చౌహన్(ఈస్టోనియా), ముహమ్మద్ ఫహద్(టర్కీ)లు భారత ఓపెనర్ కంటే ముందున్నారు. సహిల్ 27 బంతుల్లోనే వంద కొట్టేయగా.. ఫహద్ 29 బంతులు తీసుకున్నాడు. భారత్ తరఫున చూస్తే మాత్రం అభిషేక్‌దే అగ్రస్థానం.
𝐇𝐔𝐍𝐃𝐑𝐄𝐃 💯💯
Abhishek Sharma delights New Delhi 🎆
His 3⃣rd century in T20Is 🫡
Updates ▶️ https://t.co/Zixki4RhPt#TeamIndia | #AFGvIND pic.twitter.com/SfaRm2MAvs
— BCCI (@BCCI) September 17, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

