Watch: మరో మహిళతో పార్క్‌కు వెళ్లిన ప్రియుడు.. ప్రియురాలు ఏం చేసిందంటే?
Woman Jumps On Car Bonnet | ఒక వ్యక్తి మరో మహిళతో కలిసి కారులో ఒక పార్క్ వద్దకు చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు వెంటనే అక్కడకు వచ్చింది. ప్రియుడ్ని నిలదీసింది. కారులో పారిపోయేందుకు అతడు ప్రయత్నించగా బోనెట్‌పైకి ఆమె దూకింది.
లక్నో: ఒక వ్యక్తి మరో మహిళతో కలిసి కారులో ఒక పార్క్ వద్దకు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు వెంటనే అక్కడకు వచ్చింది. ప్రియుడ్ని నిలదీసింది. కారులో పారిపోయేందుకు అతడు ప్రయత్నించగా బోనెట్‌పైకి ఆమె దూకింది. (Woman Jumps On Car Bonnet) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి తన స్నేహితురాలితో కలిసి గోమతీ నగర్‌లోని జనేశ్వర్ మిశ్రా పార్క్ వద్దకు కారులో వెళ్లాడు. ఇది తెలుసుకున్న అతడి ప్రియురాలు అక్కడకు చేరుకున్నది. ప్రియుడు తనను మోసగించడంపై ఆమె నిలదీసింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.
కాగా, ఆ వ్యక్తి కారులో అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. గమనించిన ప్రియురాలు అతడ్ని అడ్డుకునేందుకు కారు ముందు నిల్చొన్నది. ప్రియుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నువ్వు ఏం చేసినా సరే, నేను చావను. కారు ఆపు’ అని బోనెట్‌పై చేతితో కొడుతూ గట్టిగా అరిచింది.
అయితే కారు డ్రైవ్ చేసిన ఆ వ్యక్తి కొన్ని నిమిషాలు పాటు మెల్లగా నడిపాడు. దీంతో బోనెట్‌పై ఉన్న ఆ మహిళ వెనక్కి నడిచింది. ఆ తర్వాత అతడు వేగం పెంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో కారు బోనెట్‌పైకి జంప్ చేసిన ఆ యువతి అదుపుతప్పి రోడ్డుపై పడింది. స్వల్పంగా గాయపడింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కొందరు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#SHOCKING : After Gurugram and Noida, a similar disturbing incident is now reported from Lucknow.
A woman was allegedly hit by a car after a dispute near Janeshwar Mishra Park, with reports saying she was dragged on the bonnet.@lkopolice @Uppolice pic.twitter.com/dMMZK6savV
— RealReport24x7 (@RealReport24X7) September 16, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

