Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Forest Staff Blocking Lion To Protect Cubs | సింహం పిల్లలను రక్షించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నించారు. ఆ ప్రాంతం వైపు వెళ్తున్న ఒక మగ సింహాన్ని బైకులతో వారు అడ్డుకున్నారు. అయితే ఆ సింహం వారిపై దాడి చేయకపోగా దారి మార్చుకుని వెళ్లడం ఆశ్చర్యం కలిగించింది.
గాంధీనగర్: సింహం పిల్లలను రక్షించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నించారు. ఆ ప్రాంతం వైపు వెళ్తున్న ఒక మగ సింహాన్ని బైకులతో వారు అడ్డుకున్నారు. అయితే ఆ సింహం వారిపై దాడి చేయకపోగా దారి మార్చుకుని వెళ్లడం ఆశ్చర్యం కలిగించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Forest Staff Blocking Lion To Protect Cubs) గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఒక మగ సింహం మరో సింహం నివసించే ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడ సింహం పిల్లలు ఉండటంతో వాటిని రక్షించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నించారు. ఆ ప్రాంతం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన మగ సింహాన్ని బైకులతో వారు అడ్డుకున్నారు. విచిత్రంగా ఆ సింహం కూడా అటవీ శాఖ సిబ్బందిపై ఎలాంటి దాడి చేయలేదు. పైగా వారి సమీపం నుంచే అది ఒక వైపునకు పరుగెత్తింది.
కాగా, ఈ వీడియో క్లిప్‌ను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇది వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. అటవీ శాఖ సిబ్బంది ఆ సింహం పట్ల అనుసరించిన పద్ధతిని కొందరు ప్రశ్నించారు. వన్యప్రాణి నియమాలను ఉల్లంఘించడాన్ని వారు తప్పుపట్టారు.
అయితే అటవీ సిబ్బంది ధైర్యాన్ని, మృగాలతో వారికి ఉన్న అనుబంధాన్ని మరికొందరు ప్రశంసించారు. అటవీ సిబ్బందిపై ఆ సింహం దాడి చేయకుండా ప్రశాంతంగా తన దిశను మార్చుకోవడం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
A video from Gir, Gujarat shows forest officials forcibly trying to stop a male lion from entering another male’s territory in order to protect the cubs there. The method being used is quite strange and concerning. A group of forest staff on five motorcycles is repeatedly moving ahead and blocking the lion’s path from the front. Neither the required safe distance from the wildlife nor the basic civility expected while dealing with wild animals is being maintained.
Whatever the intent, this approach clearly violates wildlife protocols. What is equally surprising is that even such close human proximity is not disturbing the lions.
#bigcatrules #wildlifeawareness #gujaratlion #girsomnath #girnationalpark— Gaurrav bhrdwj (@gaurravbhrdwj) November 15, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bikes
- blocking
- cubs
- forest staff
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Cyclone Akvan | ఏపీకి మరో తుపాను గండం.. తీరంవైపు కదులుతున్న వాయుగుండం..!
Type 2 Diabetes | మధుమేహం ఉంటే స్వీట్లకు బదులుగా వీటిని తినవచ్చు.. పోషకాలు, శక్తి రెండూ వస్తాయి..
KTR | నిరుద్యోగ యువతకు నాణ్యమైన స్టడీ మెటీరియల్ ఎంతో అవసరం : కేటీఆర్
Punjab CM | రోడ్డు ప్రమాద మృతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన భగవంత్ మాన్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు

