లావుడియా తండ గ్రామ పెద్దగా వాగ్య నాయక్ ఎన్నిక
లావుడియా తండ గ్రామ పెద్ద (నాయక్)గా లావుడియా వాగ్య నాయక్ నూతనంగా ఎన్నికయ్యారు.
కారేపల్లి, నవంబర్ 17: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం లావుడియా తండ గ్రామ పెద్ద (నాయక్)గా లావుడియా వాగ్య నాయక్ నూతనంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా గ్రామ కార్భారీగా లావుడియా శ్రీను నాయక్ ఎన్నికయ్యారు. గ్రామ సంప్రదాయాలు,ఆచార వ్యవహారాల ప్రకారం గ్రామ పెద్ద, కార్భారీల ఎంపిక జరిగింది.ఈ సందర్భంగా గ్రామస్తులు నూతనంగా ఎన్నికైన వారికి అభినందనలు తెలియజేశారు.
గ్రామంలో ఐక్యతను పెంపొందించడం, ప్రజల మధ్య సత్సంబంధాలను కొనసాగించడం, గ్రామానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో గ్రామ పెద్ద, కార్భారీ కీలక పాత్ర పోషించనున్నారు. గ్రామ ప్రజలందరినీ సమన్వయం చేసుకుంటూ గ్రామ అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. నూతన బాధ్యతలు చేపట్టిన వాగ్య నాయక్, శ్రీను నాయక్‌లకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లావుడియా తండ గ్రామ పెద్దగా వాగ్య నాయక్ ఎన్నిక
అట్టహాసంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఓపెన్.. కానీ జీతాల్లేవ్.. ఐదు నెలలుగా టీచర్ల ఎదురుచూపులు!
KCR | మళ్లీ బీఆర్ఎస్ రావాలి.. కేసీఆర్ సీఎం కావాలి.. రెండో రోజుకు చేరిన ఏడుపాయల–ఎర్రవల్లి పాదయాత్ర
AakasamLo Oka Tara | సెన్సార్ పూర్తి చేసుకున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్!
US Student Visa | విదేశీ విద్యార్థులకు భారీ ఊరట.. ట్రంప్ సర్కారు ప్రతిపాదనను కొట్టివేసిన అమెరికా కోర్టు!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

