అట్టహాసంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఓపెన్.. కానీ జీతాల్లేవ్.. ఐదు నెలలుగా టీచర్ల ఎదురుచూపులు!
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతోపాటు చిన్నారులకు ప్రాథమిక స్థాయిలోనే విద్య అందించాలనే లక్ష్యంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ప్రీ ప్రైమరీ స్కూళ్లలో సిబ్బందికి జీతాల కష్టాలు మొదలయ్యాయి.
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతోపాటు చిన్నారులకు ప్రాథమిక స్థాయిలోనే విద్య అందించాలనే లక్ష్యంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ప్రీ ప్రైమరీ స్కూళ్లలో సిబ్బందికి జీతాల కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,032 ప్రాథమిక పాఠశాలల్లో ఈ తరగతులను ప్రారంభించి, బోధకులు, ఆయాలను నియమించినప్పటికీ వారికి నెలల తరబడి వేతనాలు అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నియమించిన సిబ్బందికి మొదటి నెల నుంచే జీతాలు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.8 వేలు.. ఆయాకు రూ.6 వేలు
ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఒక ఇన్స్ట్రక్టర్ (బోధకుడు), ఒక ఆయాను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ.8 వేల గౌరవ వేతనం, ఆయాకు రూ.6 వేల చొప్పున చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నియామకాలు కూడా పూర్తయ్యాయి. అయితే విధుల్లో చేరి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క నెల వేతనం కూడా అందలేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా వేతనాలు విడుదల చేస్తుందనే ఆశతో కొన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులే తమ జీతాల నుంచి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకు, ఆయాలకు డబ్బులు చెల్లిస్తున్నట్లు సమాచారం. అయితే అన్ని పాఠశాలల్లోనూ ఈ పరిస్థితి లేదని తెలుస్తోంది. నెలల తరబడి జీతాలు అందకపోవడంతో కొందరు ఇన్స్ట్రక్టర్లు బోధనపై ఆసక్తి చూపడం లేదని, విధులకు సరిగా హాజరుకావడం లేదని సమాచారం.
తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తున్న తమకు అదికూడా సకాలంలో అందకపోవడంపై ప్రీ ప్రైమరీ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనికి వేతనం రాకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల జీతాలను విడుదల చేయాలని, ఇకపై ప్రతి నెలా వేతనాలు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రీ ప్రైమరీ సిబ్బందికి జీతాలు చెల్లించే విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అట్టహాసంగా కొత్త విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. అందులో పనిచేసే సిబ్బందికి కనీసం గౌరవ వేతనాలు కూడా చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని పలువురు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అట్టహాసంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఓపెన్.. కానీ జీతాల్లేవ్.. ఐదు నెలలుగా టీచర్ల ఎదురుచూపులు!
KCR | మళ్లీ బీఆర్ఎస్ రావాలి.. కేసీఆర్ సీఎం కావాలి.. రెండో రోజుకు చేరిన ఏడుపాయల–ఎర్రవల్లి పాదయాత్ర
AakasamLo Oka Tara | సెన్సార్ పూర్తి చేసుకున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్!
US Student Visa | విదేశీ విద్యార్థులకు భారీ ఊరట.. ట్రంప్ సర్కారు ప్రతిపాదనను కొట్టివేసిన అమెరికా కోర్టు!
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల్లో హింస.. పోల్ సిబ్బందిపై దాడి, మెజిస్ట్రేట్ కారు దగ్ధం
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

