Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల్లో హింస.. పోల్ సిబ్బందిపై దాడి, మెజిస్ట్రేట్ కారు దగ్ధం
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల వేళ బాన్సువారా జిల్లాలో హింస చోటుచేసుకున్నది. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి మద్దతుదారులు వీరంగం సృష్టించారు. పోలింగ్ సిబ్బందిపై దాడి చేశారు. జోనల్ మెజిస్ట్రేట్‌కు చెందిన వాహనాన్ని తగులబెట్టారు.
జైపూర్: రాజస్థాన్‌లో సోమవారం సర్పంచ్ ఎన్నికలు(Sarpanch Elections) జరిగాయి. భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే బాన్స్వారా జిల్లాలో హింస చోటుచేసుకున్నది. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి మద్దతుదారులు వీరంగం సృష్టించారు. పోలింగ్ సిబ్బందిపై దాడి చేశారు. జోనల్ మెజిస్ట్రేట్‌కు చెందిన వాహనాన్ని తగులబెట్టారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఈ ఘటన జరిగింది. బవిడి నినామా గ్రామ పంచాయతీ పరిధిలో ఈ విధ్వంసం చోటుచేసుకున్నది.
లలిత్ కుమార్ అనే సర్పంచ్ అభ్యర్థి 32 ఓట్లతో ఓటమి పాలయ్యాడు. దీంతో అతని మద్దతుదారులు హింసకు పాల్పడ్డారు. ఫలితాల ప్రకటనపై వ్యతిరేకత వ్యక్తం చేసిన లలిత్ మద్దతుదారులు ఆవేశంతో పోలింగ్ సిబ్బందిపై దాడి చేశారు. మొత్తం మూడు వాహనాలకు నిప్పుపెట్టారు. గెలిచిన అభ్యర్థి బృందంపై రాళ్లతో దాడి చేశారు. గొడవ నేపథ్యంలో భారీ సంఖ్యలో భద్రతను ఏర్పాటు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల్లో హింస.. పోల్ సిబ్బందిపై దాడి, మెజిస్ట్రేట్ కారు దగ్ధం
418 Movie | ఓటీటీలోకి ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్ ‘418’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Robert Pattinson | కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ పాటిన్సన్.. అధికారికంగా ప్రకటించిన అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్
PM Modi: మనీలాలో గురుద్వార ఖల్సాను సందర్శించిన ప్రధాని మోదీ
OM | ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాయి పల్లవి, శ్రీలీల స్పెషల్ డ్యాన్స్.. మమ్ముట్టి ప్రశంసలు,ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

