Viral news | మీకు పుస్తకం చదివే అలవాటుందా.. అయితే డబ్బులే డబ్బులు.. కానీ మన దేశంలో కాదు..!
Viral news | పుస్తకం చదవడమంటే ఒకప్పుడు చాలామందికి ఇష్టం ఉండేది. కానీ స్మార్ట్ఫోన్లు వచ్చిన తర్వాత పుస్తకాలు చదివే వారి సంఖ్య తగ్గిపోయింది. ఖాళీ సమయం దొరికినా గంటలతరబడి రీల్స్ చూస్తూ సమయం గడిపేవారే తప్ప.. పుస్తకాలు చదివే వారు అరుదుగా ఉంటున్నారు. ఈ క్రమంలో సింగపూర్ సర్కారు ఓ సరికొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది.
Viral news : పుస్తకం చదవడమంటే ఒకప్పుడు చాలామందికి ఇష్టం ఉండేది. కానీ స్మార్ట్ఫోన్లు వచ్చిన తర్వాత పుస్తకాలు చదివే వారి సంఖ్య తగ్గిపోయింది. ఖాళీ సమయం దొరికినా గంటలతరబడి రీల్స్ చూస్తూ సమయం గడిపేవారే తప్ప.. పుస్తకాలు చదివే వారు అరుదుగా ఉంటున్నారు. ఈ క్రమంలో సింగపూర్ సర్కారు ఓ సరికొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. రోజుకు కనీసం 15 నిమిషాలు పుస్తకం చదివేవారికి రివార్డు కింద వర్చువల్ నాణేలు అందిస్తున్నది.
సింగపూర్ నేషనల్ లైబ్రరీ బోర్డు సెప్టెంబర్ 6న ‘రీడ్ఎస్జీ’ పేరుతో ఐదేళ్ల జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇదే సమయంలో తొలిసారిగా నేషనల్ రీడింగ్ మంత్ను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ప్రభుత్వ ‘క్రౌడ్టాక్ ఎస్జీ’ ప్లాట్ఫామ్లో రోజూ కనీసం 15 నిమిషాలు చదివిన సమయాన్ని నమోదు చేయాలి. ఇలా చేస్తే 20 వర్చువల్ నాణేలు వస్తాయి. 1,000 నాణేలను ఒక సింగపూర్ డాలర్‌గా మార్చుకోవచ్చు. రోజుకు ఒకసారి మాత్రమే చదివిన సమయాన్ని లెక్కలోకి తీసుకుంటారు.
ప్రస్తుతం రీల్స్, నోటిఫికేషన్లు, సోషల్ మీడియా ఫీడ్లతో ప్రజల స్క్రీన్ సమయం పెరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో ఎక్కువసేపు ఒకే అంశంపై దృష్టిపెట్టి చదివే అలవాటును పెంచడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2024 లో నేషనల్ లైబ్రరీ బోర్డు నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. సింగపూర్‌లో పుస్తకాలు చదివేవారి సంఖ్య 28 శాతమే. వారిలో 89 శాతం మంది పెద్దలు వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు చదువుతున్నారు. నిర్వాహకులు చిన్నదైన 15 నిమిషాల లక్ష్యాన్ని నిర్ణయించారు.
రైలు ప్రయాణంలో, బస్సు కోసం ఎదురుచూసే సమయంలో లేదా కాఫీ తాగే విరామంలోనూ చదివేలా లక్ష్యాన్ని రూపొందించారు. ‘రీడ్ ఫర్ గుడ్’ కార్యక్రమం ద్వారా నమోదైన పఠన సమయం స్వచ్ఛంద సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగపడుతుంది. మొత్తం 75 లక్షల నిమిషాల పఠన సమయం నమోదైతే ఎంపిక చేసిన సామాజిక కార్యక్రమాలకు గరిష్ఠంగా 1.5 లక్షల సింగపూర్ డాలర్ల వరకు నిధులు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రయోగాత్మక దశలో ఉంది. పాల్గొనేవారి సూచనల ఆధారంగా ఇందులో మరిన్ని మార్పులు, కొత్త ఫీచర్లు తీసుకురానున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

