Viral | ట్రక్ డ్రైవర్ అయ్యాడు యూట్యూబ్ స్టార్
Viral |అతనో ట్రక్ డ్రైవర్. అయితేనేం యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేశాడు. బిలియన్ వ్యూస్ సాధించాడు. మిలియన్ సబ్స్క్రైబర్లు పొందాడు. నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు. అతడి స్ఫూర్తిమంతమైన జీవితం గురించి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్‌గా మారింది.
Viral |జార్ఖండ్ రాష్ట్రం, జమ్తారా (Jamtara) జిల్లాకు చెందిన రాజేశ్ రవానీ (Rajesh Rawani) 25 ఏండ్లుగా ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జాతీయ రహదారిపై భారీ లారీలను నడపటంలో అనుభవం సంపాదించాడు. అలాంటి అతడు నేడు యూట్యూబర్‌గా పేమస్ అయ్యాడు. ట్రక్కు డ్రైవర్‌గా నెలకు రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు సంపాదించే అతడు నేడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. రోడ్డు పక్కన వంటల వండుకునే స్థాయి నుంచి విలాసవంతమైన ట్రక్కును కొనుగోలు చేసే స్థాయికి ఎదిగిన తీరు లక్షల మందిని ఆకట్టుకుంటుంది.
ఆహారమే అభిరుచి
రవానీ డ్రైవర్‌గా సుదూర ప్రయాణాలు చేసేవారు. ఆ సమయంలో రోడ్డు పక్కన ట్రక్కును ఆపి తనకు నచ్చిన మటన్, చికెన్, చేపలు, పనీర్, దాల్ తడ్కా వంటి వాటితో తాజాగా భోజనం వండుకుని తినేవారు. దీనికి సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలతో వాట్సప్ ద్వారా తన కుటుంబానికి తెలియజేసేవారు. వీటిలో తండ్రి ప్రతిభను గుర్తించిన అతని కుమారులు సాగర్, శుభం ఆ వీడియోలను ఎడిట్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసేవాడు. దీనికోసం 2021లో ‘R Rajesh Vlogs’ పేరుతో యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేశాడు. మొదట్లో వంటలు మాత్రమే పోస్ట్ చేసేవారు. వీక్షకులకు ఈ వంటల వీడియోలు నచ్చడంతో స్టవ్ వెనుక ఉన్న ముఖాన్ని చూడాలని కోరారు. దీంతో అతడి ముఖాన్ని చూపిస్తూ తీసిన వీడియోకు 24 గంటల్లో నాలుగున్నర లక్షల వ్యూస్ లభించాయి.

Cooking
వేల నుంచి లక్షల సంపాదన
డ్రైవర్‌గా సాధారణ జీవితం గడిపేటప్పుడు నెలకు రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు సంపాదించేవారు రాజేశ్. యూట్యూబ్ (Youtube) చానెల్‌తో ఒక్కసారిగా అతడి ఆర్థిక ముఖచిత్రం మారిపోయింది. వేల రూపాయల నుంచి లక్షల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు. ఆయన వీడియోలతో నెలకు రూ. 4 లక్షలు లేదా రూ. 5 లక్షలు సంపాదిస్తున్నాడు. ఒక్క నెలలోనే రూ. 18 లక్షలు సంపాదించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
విలాసవంతమైన ట్రక్ కొనుగోలు
యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయంతో ఒక ట్రక్కును కొనుగోలు చేసి తన అభిరుచికి తగ్గట్టు విలావంతంగా రూపొందించుకున్నారు రవానీ. తన కొత్త వాహనంలో మార్పులు, చేర్పుల గురించి వీడియోలను జూలై, ఆగస్ట్ మధ్య యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. దీనిలోని ఏసీ, ఇంటీరియర్, స్టోరేజ్ క్యాబిన్, సుదూర ప్రయాణాలకు అనుగుణంగా సౌకర్యవంతంగా రూపొందించారు. దీంతో మొబైల్ కిచెన్‌తో పాటు ఆధునిక నివాస సౌకర్యాలు ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో ‘India’s Most Luxurious Truck’గా పేరుపొందింది.

Luxurious Truck
కష్టే ఫలి
రవానీ ట్రక్కు గతంలో ప్రమాదానికి (Accident) గురయ్యింది. అప్పుడు అతని చేతికి తీవ్ర గాయం అయ్యింది. అయినా కుటుంబ పోషణ కోసం కష్టపడ్డాడు. ఆ కష్టమే నేడు విలాసవంతమైన ట్రక్కును కొనుగోలు చేసే స్థాయికి తీసుకువచ్చింది. రవానీ యూట్యూబ్ చానెల్‌కు ఏకంగా 3 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. బిలియన్ల కొద్ది వీక్షకులను సంపాదించుకున్నారు. లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇన్‌స్టాలో ఆయనను 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆ వీక్షకులకు తన జాతీయ రహదారి ప్రయాణాలు, వంటలను చూపిస్తూ ఆనందం పంచుతున్నారు.
ఆనంద్ మహీంద్రా అభినందన
రాజేశ్ స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)ను ఆకట్టుకుంది. పట్టుదల, స్ఫూర్తికి నిజమైన నిదర్శనంగా నిలిచారని ఆనంద్ సోషల్ మీడియాలో రవానీని ప్రశంసిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో అతడి గురించి అందరికి తెలిసింది. అతడు ఎదిగిన తీరును కొనియాడుతున్నారు.

Anand Mahindra
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

