Parenting Tips | అబ్బాయిల పెంపకంలో చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఇదే.. ఈ విషయాలు మాత్రం తప్పక నేర్పండి!
Parenting Tips | చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల పెంపకంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అదే అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి చూసీచూడనట్లుగా ఉంటారు. మంచి చెప్పడంలో, చెడును విడమర్చడంలో కాస్త నిర్లిప్త ధోరణి ప్రదర్శిస్తుంటారు.
Parenting Tips | చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల పెంపకంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అదే అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి చూసీచూడనట్లుగా ఉంటారు. మంచి చెప్పడంలో, చెడును విడమర్చడంలో కాస్త నిర్లిప్త ధోరణి ప్రదర్శిస్తుంటారు. కానీ, అడ్డాల నాడు బుద్ధులు చెప్పకపోతే గడ్డాల నాడు మీ బిడ్డడు అడ్డంగా తిరిగే ప్రమాదం ఉంది. కాబట్టి, పిల్లాడు మంచి పౌరుడిగా ఎదగాలంటే చిన్న వయసులోనే కొన్ని విషయాలు నేర్పించడం అవసరం.
ఆడ పిల్లలను గౌరవించాలి
ఇంట్లో తల్లిని మాత్రమే కాదు చెల్లి, అక, స్నేహితురాలితోపాటు ఇతర మహిళలను గౌరవించాలని చిన్నప్పటి నుంచే నేర్పించాలి. నిజమైన గొప్పతనం ఎదుటివారిని గౌరవించడంలోనే ఉంటుందని పిల్లాడికి చెప్పాలి.
అబ్బాయిలు కూడా ఏడవచ్చు
అబ్బాయిలు ఎవరైనా ఏడుస్తుంటే ఆడపిల్లలా ఏడుస్తావేంటి? అని ఎగతాళి చేస్తుంటారు. కానీ, అందులో ఎలాంటి నిజం లేదు అని తల్లిదండ్రులు కొడుకి చెప్పాలి. కోపం, ప్రేమ, బాధ, సంతోషం ఎలా వ్యక్తపరుస్తామో.. ఏడుపు కూడా అలాంటి భావ ప్రకటనే. బాధను దాచుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు అనే విషయాలు పిల్లలకు నేర్పించాలి.
తప్పు చేస్తే ఒప్పుకో
ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో తప్పులు చేయడం సహజం. కానీ, చేసిన తప్పును ఒప్పుకోవడం ముఖ్యం. పిల్లలు తప్పు చేసినా ఒప్పుకోవడం నేర్పించాలి. చేసిన తప్పునకు క్షమాపణ చెప్పడం మంచి లక్షణం. ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి.
ఇంటి పనులు అందరి బాధ్యత
చాలామంది ఇంటి పనులు కేవలం ఆడవాళ్ల బాధ్యత అనే భావనతో ఉంటారు. తమ పిల్లలకు సైతం అలాంటి మాటలే చెబుతుంటారు. ఆ ఆలోచన మారాలి. ఇంటి పని కుటుంబసభ్యుల అందరి బాధ్యత అని చిన్నప్పటి నుంచే చెప్పాలి. అది ఆడవాళ్ల పని అనే భావన పిల్లల మనసులోకి రాకుండా వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, పాత్రలు శుభ్రం చేయడం లాంటి పనులను మగ పిల్లలకూ నేర్పాలి.
అదొక్కటే ముఖ్యం కాదు
జీవితంలో విజయం సాధించడం అంటే డబ్బు సంపాదించడం, జీతం ఎకువగా ఉండటం కాదు. నిజాయతీతో ఉండటం, ఇతరులతో దయగా ఉండటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం అనే విలువైన మాటలు తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించడం ఎంతో ముఖ్యం.
నేర్చుకోవడం ఆపకూడదు
జీవితంలో ప్రతి రోజూ కొత్త పాఠమే. పుస్తకాల నుంచి మాత్రమే కాదు, మనుషుల నుంచి, అనుభవాల నుంచి, తప్పుల నుంచి కూడా నేర్చుకోవాలి. ఇది జీవితంలో గెలవడానికి సహాయపడుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
MLA Madhavaram krishna rao | హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి.. సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

