Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
Earthquake | హిందూ మహాసముద్రం (Indian Ocean) లో ఇవాళ (మంగళవారం) భూకంపం (Earthquake) సంభవించింది. మారిషస్ దేశానికి సమీప ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై ఆ భూకంప తీవ్రత 6.4 గా నమోదైంది. అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ (USGS) వెల్లడించిన వివరాల ప్రకారం.. భూకంప కేంద్రం మారిషస్-రీయూనియన్ ప్రాంతంలోని సముద్ర గర్భంలో ఉంది.
Earthquake : హిందూ మహాసముద్రం (Indian Ocean) లో ఇవాళ (మంగళవారం) భూకంపం (Earthquake) సంభవించింది. మారిషస్ దేశానికి సమీప ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై ఆ భూకంప తీవ్రత 6.4 గా నమోదైంది. అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ (USGS) వెల్లడించిన వివరాల ప్రకారం.. భూకంప కేంద్రం మారిషస్-రీయూనియన్ ప్రాంతంలోని సముద్ర గర్భంలో ఉంది. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఇది సంభవించింది.
భారత కాలమానం ప్రకారం.. మంగళవారం సాయంత్రం సుమారు 4:36 గంటలకు ఈ భూకంపం వచ్చింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ద్వీపం అంతటా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకన్లపాటు భూమి స్పష్టంగా కంపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అనంతరం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మరోవైపు సునామీకి సంబంధించి యూఎస్జీఎస్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
అయితే ఆ సంస్థ గ్రీన్ అలర్ట్ జారీచేసింది. ప్రాణనష్టం, భారీ ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు అంచనా వేసింది. భూకంప ప్రభావం, నష్టానికి సంబంధించిన పూర్తి సమాచారం అధికారికంగా వెలువడాల్సి ఉంది. కాగా ఇటీవల హిందూ మహాసముద్రంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. తరచుగా ప్రకంపనలు వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
వీటిలో ఆగ్నేయ హిందూ మహాసముద్ర రిడ్జ్, రోడ్రిగ్స్ ట్రిపుల్ జంక్షన్ సమీపంలో సంభవించిన ప్రకంపనలూ ఉన్నాయి. సముద్ర గర్భంలో సంభవించే భూకంపాలవల్ల సునామీ వచ్చే ప్రమాదం ఉంటుంది. దాంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సునామీ హెచ్చరికలు జారీ చేస్తుంటారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
MLA Madhavaram krishna rao | హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి.. సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
కాచిరాజుగూడెంలో కోడి పందాలపై పోలీసుల రైడ్
AP Rains | బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఏపీలో నాలుగురోజులు వర్షాలు..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

