MLA Madhavaram krishna rao | హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి.. సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
MLA Madhavaram krishna rao | కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ట్రక్ పార్క్ భూములను వేలాన్ని వ్యతిరేకిస్తూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, సీపీఎం, సీపీఐ నేతలతో కలిసి ఆదివారం శాంతియుత నిరాహార దీక్ష కూడా చేపట్టారు.
MLA Madhavaram krishna rao | కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ట్రక్ పార్క్ భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలను ముమ్మరం చేసిందని తెలిసిందే. ఈ భూములపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న బాధితులు, స్థానికులతో కలిసి మాజీ మంత్రి హరీశ్‌రావు నిరసనలో కూడా పాల్గొని వారికి మద్దతుగా నిలిచారు. మరోవైపు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, సీపీఎం, సీపీఐ నేతలతో కలిసి ఆదివారం శాంతియుత నిరాహార దీక్ష కూడా చేపట్టారు.
ఆందోళనలో భాగంగా హైదరాబాద్ మహానగరం పరిధిలో ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన విలువైన ప్రభుత్వ భూముల విక్రయాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, వామపక్ష పార్టీల సహకారంతో రేపు (నవంబర్ 25న) హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు భూములు, హుడా ట్రక్ పార్క్ భూములు, మియాపూర్ భూములు ఇలా నగర పరిధిలో నివాస ప్రాంతాల నడుమ ఉన్న విలువైన ప్రభుత్వ భూములను ప్రజా ఉపయోగానికి వినియోగించకుండా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు. కూకట్పల్లి హుడా ట్రక్ పార్క్ భూముల అమ్మకాలపై పార్టీలకతీతంగా ప్రజలందరూ పోరాడాలి… మన భూములను కాపాడుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా 25వ తేదీన నిర్వహించే హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ మహానగరం పరిధిలో ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన విలువైన ప్రభుత్వ భూముల విక్రయాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, వామపక్ష పార్టీల సహకారంతో రేపు (నవంబర్ 25న) హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నాం.
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు భూములు, హుడా ట్రక్ పార్క్ భూములు, మియాపూర్ భూములు ఇలా నగర పరిధిలో నివాస ప్రాంతాల నడుమ ఉన్న విలువైన ప్రభుత్వ భూములను ప్రజా ఉపయోగానికి వినియోగించకుండా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
కూకట్పల్లి హుడా ట్రక్ పార్క్ భూముల అమ్మకాలపై పార్టీలకతీతంగా ప్రజలందరూ పోరాడాలి… మన భూములను కాపాడుకోవాలి.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా 25వ తేదీన నిర్వహించే హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలి.– ఎమ్మెల్యే @mkrkkpmla
— BRS Party (@BRSparty) November 24, 2026
Read Also :
రాయరావుపేటలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై వివాదం.. కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు
Septic tank | బాచుపల్లిలో విషాదం..సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ముగ్గురుయువులు మృతి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Madhavaram krishna rao | హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి.. సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
కాచిరాజుగూడెంలో కోడి పందాలపై పోలీసుల రైడ్
AP Rains | బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఏపీలో నాలుగురోజులు వర్షాలు..!
Sampath Nandi | పవన్ కల్యాణ్‌తో సినిమా చేయని సంపత్ నంది.. కారణం ఏంటో తెలుసా..?
Karthika Pournami | వేయిస్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి శోభ.. దర్శనానికి బారులు తీరిన భక్తులు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

