Sampath Nandi | పవన్ కల్యాణ్‌తో సినిమా చేయని సంపత్ నంది.. కారణం ఏంటో తెలుసా..?
Sampath Nandi | పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. బాబీ డైరెక్ట్ చేశాడు. అయితే ముందుగా ఈ సినిమా ఆఫర్ సంపత్ నందికి వచ్చిందట. కానీ ఫైనల్‌గా బాబీ చేతుల్లోకి వెళ్లింది.
Sampath Nandi | ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమా ఇంకొకరి చేతుల్లోకి పోవడం సాధారణంగా కనిపించేదే.. కొన్ని సార్లు ఓ డైరెక్టర్ చేయాల్సిన సినిమా ఇంకో డైరెక్టర్ చేయడం,, ఓ హీరో నటించాల్సిన సినిమాలో ఇంకో యాక్టర్ నటించడం కనిపిస్తుంటుంది.. ఒకరు చేస్తారనుకున్న ప్రాజెక్ట్ అనుకోకుండా ఇంకొకరి చేతుల్లోకి వెళ్తుంది.
డైరెక్టర్ సంపత్ నంది విషయంలో కూడా అదే జరిగింది. ఇంతకీ ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఏ హీరోతో సినిమా చేయాల్సి ఉండే అనుకుంటున్నా..? అతడెవరో కాదు పవన్ కల్యాణ్. ఈ స్టార్ యాక్టర్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. బాబీ డైరెక్ట్ చేశాడు. అయితే ముందుగా ఈ సినిమా ఆఫర్ సంపత్ నందికి వచ్చిందట. కానీ ఫైనల్‌గా బాబీ చేతుల్లోకి వెళ్లింది. ఈ విషయమై భోగి ప్రమోషన్స్‌లో ఆసక్తికర విషయం షేర్ చేశాడు సంపత్ నంది.
‘నేను పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది.. అయితే పవన్ కల్యాణ్ బిజీ షెడ్యూల్ వల్ల సినిమా పనులు ఆలస్యమవుతూ వచ్చాయి. దీనిపై అప్పట్లో పవన్ కల్యాణ్‌కు క్లారిటీ కూడా లేదు.. ఆయన ఓ రోజు నన్ను వెయిట్ చేయగలవా.. అని అడిగారు. దీంతో నేను ఈ గ్యాప్‌లో వేరే సినిమా పూర్తి చేసుకుంటే మీకు ఇబ్బందేమీ లేదు కదా.. అని పవన్ కల్యాణ్‌ను అడిగాను. అలా కూల్‌గా ఆ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నానన్నాడు. అది రీమేక్ సినిమా కాదని, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను డైరెక్ట్ చేయమని నన్ను అడిగారని అన్నాడు. అయితే ఆ తర్వాత పవన్ కల్యాణ్ నాతో సినిమా చేయాలని ఎంతో ప్రయత్నించారని నిర్మాతల ద్వారా తెలిసింది. మా ఇద్దరి ప్రయాణం అద్భుతంగా సాగింది.. ఎవరినీ కూడా ఎక్కువ కాలం వేచి ఉండేలా చేయడం పవన్ కల్యాణ్‌కు ఇష్టముండదని’ చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read Also :
రాయరావుపేటలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై వివాదం.. కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు
Septic tank | బాచుపల్లిలో విషాదం..సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ముగ్గురుయువులు మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sampath Nandi | పవన్ కల్యాణ్‌తో సినిమా చేయని సంపత్ నంది.. కారణం ఏంటో తెలుసా..?
Karthika Pournami | వేయిస్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి శోభ.. దర్శనానికి బారులు తీరిన భక్తులు
Vidadala Rajini | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం : వైసీపీ మాజీ మంత్రి రజిని
Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 28 బంతుల్లో సెంచరీ.. 52 బంతుల్లో డబుల్ సెంచరీ..!
వెంపటి హత్య కేసులో ఎనిమిది మంది అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

