Karthika Pournami | వేయిస్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి శోభ.. దర్శనానికి బారులు తీరిన భక్తులు
Karthika Pournami | చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది.
హనుమకొండ చౌరస్తా : చారిత్రక రుద్రేశ్వరస్వామి( Rudreshwara Swamy ) వేయిస్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి ( Karthika Pournami ) శోభ సంతరించుకుంది. మంగళవారం ఉదయం మంగళ వాయిద్యం ఉత్తిష్ఠ గణపతికి నారీకేల జలాభిషేకం, లోకకళ్యాణార్థం రుద్రేశ్వరస్వామికి సుమారు 2 వేల మంది భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు.

సాయంత్రం 6 గంటలకు ఆలయ దీపోత్సవ కార్యక్రమనికి ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు మహేష్‌బాబు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచారి ముఖ్యఅతిథులుగా పాల్గొని దేవాదాయ ధర్మాదాయశాఖ అందించిన దీప ప్రమిదలను, లక్ష వత్తులను, నువ్వుల నూనెతో తదితర వస్తువులను అందజేశారు.
జ్యోతి పరంజ్యోతి అంటూ మారేడు వృక్షం దగ్గర దీపాలు వెలిగించుకుని లక్ష దీపోత్సవంలో పాల్గొన్నారు. దేవాలయానికి రుద్రాభిషేకాల ద్వారా రూ.4 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో అనిల్‌కుమార్, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు, సీఐ శివకుమార్ భక్తులకు ఇబ్బందుల్లేకుండా విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. వైదిక కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ, వేద పండితులు మణికంఠశర్మ, అర్చకులు దత్తకుమార్ శర్మ, ప్రణవ్, శ్రవణ్ నిర్వహించారు. ఆలయ ఈవో డి.అనిల్‌కుమార్, ఆలయ సిబ్బంది ఎన్.మధుకర్, ఎల్.రామకృష్ణ, బి.రజిత, శ్రీ రాజరాజేశ్వర సేవాసమితి మహిళా సభ్యులు సేవలందించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthika Pournami | వేయిస్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి శోభ.. దర్శనానికి బారులు తీరిన భక్తులు
Vidadala Rajini | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం : వైసీపీ మాజీ మంత్రి రజిని
Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 28 బంతుల్లో సెంచరీ.. 52 బంతుల్లో డబుల్ సెంచరీ..!
వెంపటి హత్య కేసులో ఎనిమిది మంది అరెస్ట్
KCR Attender | మణిదీప్ కుమార్ పాడే మోసిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

