KCR Attender | మణిదీప్ కుమార్ పాడే మోసిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్
KCR Attender | కేసీఆర్ ఆదేశాల మేరకు మణిదీప్ కుమార్ స్వగ్రామం బందనకల్‌లో జరిగిన అతని అంత్యక్రియల్లో మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌తోపాటు కేసీఆర్ వ్యక్తిగత సిబ్బంది పాల్గొన్నారు.
KCR Attender | ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యాలయ అటెండర్‌గా పనిచేస్తున్న మణిదీప్ కుమార్ నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇప్పటికే కేసీఆర్ సంతాపం ప్రకటించారని తెలిసిందే. కాగా కేసీఆర్ ఆదేశాల మేరకు మణిదీప్ కుమార్ స్వగ్రామం బందనకల్‌లో జరిగిన అతని అంత్యక్రియల్లో మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌తోపాటు కేసీఆర్ వ్యక్తిగత సిబ్బంది పాల్గొన్నారు.
మణికుమార్ మరణవార్త వినగానే స్పందించిన కేసీఆర్ అన్ని దగ్గరుండి చూసుకోవాలని సంతోష్ కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు సంతోష్ కుమార్ బందనకల్కి చేరుకుని మణికుమార్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మణికుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. పాడే మోసి మణిదీప్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
మణిదీప్ కుటుంబాన్ని కేసిఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటారని ఈ సందర్భంగా సంతోష్ కుమార్ తెలిపారు. మణిదీప్ కి నాన్న,చెల్లి, నానమ్మ ఉన్నారు. మణిదీప్ చెల్లి చదువుతోపాటు పెళ్లి బాధ్యతలు కేసిఆర్ తీసుకుంటారని చెప్పారు. నాన్న, నాన్నమ్మ ఆరోగ్య బాగోగులు కూడా కేసిఆర్ చూసుకుంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావు, అంజిరెడ్డి, జుబేర్, కేసిఆర్ పీఎస్ నాగేందర్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Read Also :
రాయరావుపేటలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై వివాదం.. కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు
Septic tank | బాచుపల్లిలో విషాదం..సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ముగ్గురుయువులు మృతి
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR Attender | మణిదీప్ కుమార్ పాడే మోసిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్
ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక
Y.S. Jagan | మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలి : వైఎస్ జగన్
Health tips | మీ ఒంట్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే రెగ్యులర్‌గా ఇవి తీసుకోవాలట..!
TTD Insurance | తిరుమల భక్తులకు బీమా పథకం ప్రారంభం.. ఏడుగురికి పరిహారం అందజేత
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

