TTD Insurance | తిరుమల భక్తులకు బీమా పథకం ప్రారంభం.. ఏడుగురికి పరిహారం అందజేత
TTD Insurance | తిరుమల శ్రీవారి భక్తులకు శ్రీవారి యాత్ర సురక్ష పేరుతో తీసుకొచ్చిన బీమా పథకాన్ని టీటీడీ ప్రారంభించింది.
తిరుమల : దేశంలోనే తొలిసారిగా తిరుమల ( Tirumala ) శ్రీవారి భక్తులకు శ్రీవారి యాత్ర సురక్ష పేరుతో తీసుకొచ్చిన బీమా పథకాన్ని ( Insurance scheme) టీటీడీ ప్రారంభించింది. ఇందులో భాగంగా తిరుమలలో మరణించిన భక్తుల కుటుంబ సభ్యులకు బీమా కింద రూ.2 లక్షల పరిహారాన్ని ( Compensation ) మంగళవారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ శ్రీవారి యాత్ర సురక్ష’ ( Srivari Suraksha Yatra ) పథకం ద్వారా దేశంలోనే తొలిసారిగా భక్తులకు భరోసా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గత రెండు నెలల్లో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచచ్చి సహజంగా మరణించిన ఏడుగురు కుటుంబ సభ్యులకు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా సీఈవో , ఎండీ ఆర్.దొరైస్వామిలతో కలిసి మంగళవారం రూ.2 లక్షలు బీమా పరిహారాన్ని అందజేశారు.
తిరుమలకు వచ్చే భక్తులు సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షలు అందిస్తున్నామని వివరించారు. గత రెండు నెలల కాలంలో 17 మంది తిరుమలలో మరణించారని, వారిలో 7 మంది కుటుంబ సభ్యులకు బీమా పరిహారాన్ని అందించామన్నారు. మిగిలిన వారికి త్వరలో అందిస్తామని పేర్కొన్నారు. తమకు కష్టకాలంలో చేదోడువాదోడుగా నిలిచి ఆర్థికంగా ఆదుకున్నందుకు టీటీడీకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD Insurance | తిరుమల భక్తులకు బీమా పథకం ప్రారంభం.. ఏడుగురికి పరిహారం అందజేత
RS Praveenkumar | మెటా కేసులో ఒక న్యాయం.. ‘మహా’ కేసులో మరో న్యాయం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
టీఏజీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ
RS Praveen Kumar | హైదరాబాద్‌లో టెర్రర్ అటాక్స్ ఉన్నాయనే కాన్ఫిడెన్షియల్ మెసేజ్ సోషల్ మీడియాలోకి ఎలా వెళ్లింది?
Sheikh Hasina | చేతులకు సంకెళ్లతో మాత్రమే స్వదేశానికి షేక్ హసీనా : బంగ్లాదేశ్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

