రాయరావుపేటలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై వివాదం.. కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు
బీబీనగర్ మండలంలోని రాయరావుపేటలో భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పాత లేఔట్‌కు ఆనుకుని ఉన్న వ్యవసాయ భూమిని లేఔట్లో భాగంగా చూపించి ప్లాట్లుగా రిజిస్ట్రేషన్లు చేపట్టినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై...
బీబీనగర్, నవంబర్ 24 : బీబీనగర్ మండలంలోని రాయరావుపేటలో భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పాత లేఔట్‌కు ఆనుకుని ఉన్న వ్యవసాయ భూమిని లేఔట్లో భాగంగా చూపించి ప్లాట్లుగా రిజిస్ట్రేషన్లు చేపట్టినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. సర్వే నంబర్లు 61, 62లో ఉన్న 2 ఎకరాల 23 గుంటల పాత లేఔట్‌కు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు 58, 59, 60లోని ఒక ఎకరం 38 గుంటల వ్యవసాయ భూమిని కూడా పాత లేఔట్లో భాగంగా చూపించినట్లు ఆరోపించారు. ఈ క్రమంలో వ్యవసాయ భూమిని ప్లాట్లుగా చూపించి రిజిస్ట్రేషన్లు చేపట్టడంతో పాటు పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కలెక్టర్‌కు వివరించారు.

రాయరావుపేటలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై వివాదం.. కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు
వ్యవసాయ భూమిని లేఔట్లో భాగంగా చూపించడానికి అనుమతులు ఉన్నాయా, ఏ పత్రాల ఆధారంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి, ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత ఉందనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని ఫిర్యాదులో కోరారు. ఈ వ్యవహారంలో ప్రస్తుత సర్పంచ్ పాత్రపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. భూముల సర్వే నంబర్లు, లేఔట్ అనుమతులు, రిజిస్ట్రేషన్ పత్రాలను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భూ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాయరావుపేటలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై వివాదం.. కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు
Harish Rao | అతిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన త్యాగం మాది : హరీశ్ రావు
Road accident | విషాదం..కొడుకును సాగనంపి, తిరిగిరాని లోకాలకు తల్లిదండ్రులు
Arrest | నకిలీ కరెన్సీ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు..నలుగురు అరెస్ట్
BDL | బీడీఎల్ సంగారెడ్డిలో 134 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు.. చివరితేదీ నవంబర్ 30
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

