Road accident | విషాదం..కొడుకును సాగనంపి, తిరిగిరాని లోకాలకు తల్లిదండ్రులు
కొడుకును డాక్టర్‌ను చేయాలన్న కలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్లి సాగనంపి వచ్చిన ఆ తల్లిదండ్రులు తిరిగి ఇంటికి చేరలేదు.
జహీరాబాద్, నవంబర్ 24 : కొడుకును డాక్టర్‌ను చేయాలన్న కలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్లి సాగనంపి వచ్చిన ఆ తల్లిదండ్రులు తిరిగి ఇంటికి చేరలేదు. వారి ప్రయాణం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ వద్దే ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే..మహారాష్ట్రలోని ఉమర్గా, మురము గ్రామానికి చెందిన శరణప్ప, సుస్మిత దంపతుల కుమారుడు నేపాల్‌లో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. సెలవులకు వచ్చిన కుమారుడిని తిరిగి నేపాల్ పంపేందుకు మంగళవారం దంపతులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. అక్కడ కుమారుడిని సాగనంపి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు.
శంషాబాద్ నుంచి కంకోల్ టోల్గేట్ వరకు డ్రైవర్ కారు నడిపాడు. ఆదివారం నుంచి నిరంతరం డ్రైవింగ్ చేయడంతో అలసిపోయాడని గమనించిన శరణప్ప మానవత్వంతో డ్రైవర్‌ను వెనక సీట్లో కూర్చోబెట్టి, భార్యను ముందు సీట్లో కూర్చోబెట్టుకుని తానే డ్రైవింగ్ చేపట్టాడు. జహీరాబాద్ పట్టణ పరిధిలోని అల్గోల్ చౌరస్తా సమీపంలో కోళ్ల లోడ్‌తో ఉన్న లారీ డ్రైవర్ టిఫిన్ కోసం రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో రోడ్డుపై ఉన్న డ్రమ్ములను తప్పించబోయి శరణప్ప నడుపుతున్న కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముందు సీట్లో ఉన్న భార్యాభర్తలు కారులోనే ఇరుక్కుపోయారు. స్థానికులు వారిని బయటకు తీసి జహీరాబాద్ ప్రభుత్వ దవాఖాను తరలించేలోపే ఇద్దరూ మృతి చెందారు. వెనక సీట్లో ఉన్న డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కొడుకును నవ్వుతూ సాగనంపిన తల్లిదండ్రులు విగతజీవులుగా మారడంతో మురము గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జహీరాబాద్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | విషాదం..కొడుకును సాగనంపి, తిరిగిరాని లోకాలకు తల్లిదండ్రులు
Arrest | నకిలీ కరెన్సీ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు..నలుగురు అరెస్ట్
BDL | బీడీఎల్ సంగారెడ్డిలో 134 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు.. చివరితేదీ నవంబర్ 30
Punjab Elections | బీజేపీ, అకాలీదళ్ పార్టీ మధ్య కుదిరిన పొత్తు.. పంజాబ్‌లో ఆరేళ్ల తర్వాత మళ్లీ కలిసిన బంధం..!
Harish Rao | రేవంత్ రెడ్డి గురుదక్షిణ వల్లే పాలమూరులో పంటలు ఎండిపోయాయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

