Punjab Elections | బీజేపీ, అకాలీదళ్ పార్టీ మధ్య కుదిరిన పొత్తు.. పంజాబ్లో ఆరేళ్ల తర్వాత మళ్లీ కలిసిన బంధం..!
Punjab Elections | అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు పంజాబ్ (Punjab) రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. బీజేపీ (BJP), శిరోమణి అకాలీదళ్ (SAD) పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఆరేళ్ల క్రితం విడిపోయిన ఈ పాత మిత్రపక్ష పార్టీలు మళ్లీ చేతులు కలిపాయి.
Punjab Elections : అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు పంజాబ్ (Punjab) రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. బీజేపీ (BJP), శిరోమణి అకాలీదళ్ (SAD) పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఆరేళ్ల క్రితం విడిపోయిన ఈ పాత మిత్రపక్ష పార్టీలు మళ్లీ చేతులు కలిపాయి. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం (BJP Head quarters) లో ఇరుపార్టీలు తమ పొత్తు విషయాన్ని అధికారికంగా ప్రకటించాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పొత్తును ప్రకటించారు. గురునానక్ దేవ్ 556వ ప్రకాష్ పురబ్ (జయంతి) పర్వదినం రోజుననే ఈ ప్రకటన వెలువడటం విశేషం. పంజాబ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేవల్ సింగ్ థిల్లాన్, మాజీ అధ్యక్షులు సునీల్ జాఖర్, అశ్వని కుమార్ సహా సీనియర్ అకాలీదళ్ నేత బల్దేవ్ సింగ్ భుందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతకుముందు దాదాపు 24 ఏళ్లపాటు కలిసి ప్రయాణించిన ఈ రెండు పార్టీలు.. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు ఉధృతమవడంతో 2020 సెప్టెంబర్లో విడిపోయాయి. అప్పుడు అకాలీదళ్ ఎన్డీయే కూటమి నుంచి బయటకు రాగా.. హర్సిమ్రత్ కౌర్ బాదల్ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఇటీవల సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రధాని మోదీతో భేటీ అయ్యి పొత్తు విషయం మాట్లాడారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Elections | బీజేపీ, అకాలీదళ్ పార్టీ మధ్య కుదిరిన పొత్తు.. పంజాబ్లో ఆరేళ్ల తర్వాత మళ్లీ కలిసిన బంధం..!
Harish Rao | రేవంత్ రెడ్డి గురుదక్షిణ వల్లే పాలమూరులో పంటలు ఎండిపోయాయి : హరీశ్ రావు
Fetal Back Surgery | భారత వైద్య రంగంలో అరుదైన ఘనత.. గర్భస్థ శిశువుకు విజయవంతంగా వెన్నెముక చికిత్స..
Burnt alive | జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
Karthika Pournami | యాదగిరిగుట్టలో భక్తుల సందడి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

