Burnt alive | జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
Burnt alive | ఏపీ లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం కావడం కలకలం సృష్టించింది.
అమరావతి : ఏపీ ( Andhra Pradesh ) లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం ( Burnt alive) కావడం కలకలం సృష్టించింది. అనకాపల్లి-ఆనందపురం రహదారిపై బాటజంగాలపాలెం సమీపంలో రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో డ్రైవర్, క్లీనర్ సజీవదహనమయ్యారు.
మృతులు మాదాసూరి అప్పారావు(45), శ్యాంప్రసాద్ ( 22 )గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా భోగాపురం హైవేపై మరో ఘోర ప్రమాదం జరిగింది. సుందరపేట సమీపంలో తెల్లవారుజామున ఆగి ఉన్న ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన థార్ కారు ఢీకొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burnt alive | జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
Karthika Pournami | యాదగిరిగుట్టలో భక్తుల సందడి
Microsoft Employee | 24 ఏళ్లు నమ్మకంతో పనిచేస్తే.. ఒక్క మెయిల్‌తో ముగింపు.. మెక్రోసాఫ్ట్ ఉద్యోగిని ఎమోషనల్ పోస్టు
Panchayat 5 | ఫులేరాలో మారిన రాజకీయం.. ఆకట్టుకుంటున్న ‘పంచాయత్ 5’ ట్రైలర్!
Bank Jobs | ఎగ్జిమ్ బ్యాంక్‌లో 120 ఖాళీలు.. నవంబర్ 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

