Bank Jobs | ఎగ్జిమ్ బ్యాంక్‌లో 120 ఖాళీలు.. నవంబర్ 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం
బ్యాంక్ ఉద్యోగం చేయాలనుకునేవారికి ఎగ్జిమ్ బ్యాంక్ శుభవార్త ప్రకటించింది. పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం.
ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (EXIM Bank) 2026 రిక్రూట్మెంట్లో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 120 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి గల యంగ్ ప్రొఫెషనల్స్ నుంచి దరఖాస్తులు కోరుతుంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 27 నుంచి ప్రారంభమవుతుంది.
పోస్టుల వివరాలు
మేనేజ్మెంట్ ట్రెయినీ (MT)- 90
బ్యాంకింగ్ ఆపరేషన్స్ (Credit/Loans/Advances)- 50
ట్రెజరీ అండ్ అకౌంట్స్- 3
ఇంటర్నేషనల్ రిలేషన్స్- 1
ఇంటర్నల్ ఆడిట్- 5
కంప్లయన్స్- 2
ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ (ESG)- 1
రిస్క్ మేనేజ్మెంట్- 2
సైబర్ సెక్యూరిటీ- 2
లీగల్- 10
డిజిటల్ టెక్నాలజీ- 9
హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్- 2
అడ్మినిస్ట్రేషన్- 2
కార్పొరేట్ కమ్యూనికేషన్స్- 1
మేనేజర్- 30
క్రెడిట్ అప్రైజల్- 4
లోన్ ఆపరేషన్స్ అండ్ మానిటరింగ్- డాక్యుమెంటరీ క్రెడిట్- 3
లోన్ ఆపరేషన్స్ అండ్ మానిటరింగ్- బ్యాంక్ గ్యారంటీస్- 3
లోన్ ఆపరేషన్స్ అండ్ మానిటరింగ్- ట్రేడ్ ఫైనాన్స్- 4
స్పెషల్ సిచ్యుయేషన్స్ గ్రూప్/రికవరీ- 3
రిస్క్ మేనేజ్మెంట్- 2
కంప్లయన్స్- 2
ఇంటర్నల్ ఆడిట్- ట్రెజరీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్- 2
ఇంటర్నల్ ఆడిట్- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ- 1
మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (MSME)- 2
సస్టెయినబుల్ ఎంటర్ప్రైజ్ అండ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్- 2
కార్పొరేట్ కమ్యూనికేషన్స్/కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ- 2

Exim Posts
అర్హతలు
పోస్టును బట్టి ఎంబీఏ, పీజీడీబీఏ, పీజీడీఎం, ఎంఎంఎస్, ఎంఏ (ఎకనామిక్స్), సీఏతో పాటు ICAIలో సభ్యత్వం, ఎల్ఎల్బీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు
అభ్యర్థుల వయసు మేనేజ్మెంట్ ట్రెయినీకి 21 నుంచి 28, మేనేజర్ (MM-II)కు 24 నుంచి 30 ఏండ్లలోపు ఉండాలి.
రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక
ఆన్లైన్ రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో పార్ట్-1 ఫైనాన్షియల్ స్టేట్మెంట్ (కంపల్సరీ క్వశ్చన్)- 40, పార్ట్-2 ప్రొఫెషనల్ నాలెడ్జ్- సబ్జెక్టివ్ (అటెంప్ట్ ఏవైనా 6 నుంచి 8 ప్రశ్నలు)- 60 మార్కులు కేటాయించారు.
ఫీజు
దరఖాస్తు ఫీజు రూ. 600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్, మహిళలకు రూ. 100.
వేతనం
ఎంపికైన మేనేజ్మెంట్ ట్రెయినీలకు సంవత్సరం ట్రెయినింగ్ పీరియడ్‌లో నెలకు రూ. 65,000 స్టైపెండ్‌గా ఇస్తారు. మేనేజర్లకు రూ. 64,820-93,960 ఉంటుంది.
చివరితేదీ
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 27 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 11తో ముగుస్తుంది. ఇతర వివరాలకు వెబ్సైట్ https://www.eximbankindia.in చూడండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bank Jobs | ఎగ్జిమ్ బ్యాంక్‌లో 120 ఖాళీలు.. నవంబర్ 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం
Chiranjeevi Megaverse | చిరంజీవి పేరులో ‘N’ మాయం వెనుక అసలు కథ ఇదే.. ‘మెగావర్స్’ టీజర్ వచ్చేసింది!
Road Accident | భోగాపురం హైవేపై ఘోర ప్రమాదం.. ట్యాంకర్‌ను ఢీకొన్న థార్, ఐదుగురు మృతి
Prostate Cancer | ప్రోస్టేట్ క్యాన్సర్ గుర్తింపు, చికిత్సకు కొత్త మార్గదర్శకాలు.. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఏం చెప్పింది..?
Sreejith Ravi | పోక్సో కేసులో మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష.. త్రిసూర్ కోర్టు సంచలన తీర్పు!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

