Sreejith Ravi | పోక్సో కేసులో మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష.. త్రిసూర్ కోర్టు సంచలన తీర్పు!
Sreejith Ravi | మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపిన పోక్సో (POCSO) కేసులో ప్రముఖ నటుడు శ్రీజిత్ రవికి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపిన పోక్సో (POCSO) కేసులో ప్రముఖ నటుడు శ్రీజిత్ రవికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నటుడు టీజీ రవి కుమారుడైన శ్రీజిత్ రవిని దోషిగా తేల్చిన కేరళలోని త్రిసూర్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం, ఆయనకు ఏడాది పాటు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తూ సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 2022లో ఇద్దరు మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఈ కేసులో న్యాయమూర్తి రమ్య మీనన్ ఈ మేరకు తుది తీర్పును ప్రకటించారు.
వివరాల్లోకి వెళితే.. 2022 జూలై 4న త్రిసూర్‌లోని అరనాట్టుకర ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న ఇద్దరు మైనర్ బాలికలను శ్రీజిత్ రవి తన కారులో వెంబడించారు. అనంతరం అక్కడి ఓ అపార్ట్మెంట్ కార్ పార్కింగ్ ప్రాంతంలో ఆ బాలికలను చూస్తూ తన ప్రైవేట్ పార్ట్స్ ప్రదర్శిస్తూ అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధిత బాలికల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, స్థానిక సీసీటీవీ ఫుటేజీలు మరియు కారు నంబర్ ఆధారంగా నిందితుడిని నటుడు శ్రీజిత్ రవిగా గుర్తించి పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. దాదాపు నాలుగేళ్ల పాటు సాగిన ఈ విచారణలో ప్రాసిక్యూషన్ తరఫున 21 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఘటన జరిగిన సమయంలో ఆ ఇద్దరు చిన్నారులు ఇచ్చిన కీలక వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, నేరం రుజువు కావడంతో నిందితుడిని దోషిగా నిర్ధారించింది.
విచారణ సందర్భంగా శ్రీజిత్ రవి తరపు న్యాయవాది వాదిస్తూ, తమ క్లయింట్‌కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని, ఈ శిక్ష వల్ల ఆయన సినీ కెరీర్ తీవ్రంగా దెబ్బతింటుందని పేర్కొంటూ శిక్షను తగ్గించాలని అభ్యర్థించారు. అయితే ఈ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఇద్దరు పాఠశాల విద్యార్థినులను లక్ష్యంగా చేసుకున్నాడని, ఇలాంటి చర్యల వల్ల చిన్నారుల లేత మనసులపై దీర్ఘకాలిక మానసిక ప్రభావం పడుతుందని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, దోషి నుంచి వసూలు చేసిన జరిమానా మొత్తాన్ని బాధిత బాలికలిద్దరికీ నష్టపరిహారంగా సమానంగా పంచి ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా, ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు శ్రీజిత్ రవికి న్యాయస్థానం 30 రోజుల గడువు ఇచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreejith Ravi | పోక్సో కేసులో మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష.. త్రిసూర్ కోర్టు సంచలన తీర్పు!
ATM | నిజామాబాద్‌లో ఏటీఎం చోరీకి యత్నం..! అలారం మోగడంతో పారిపోయిన దుండగుడు
Dharman | రజినీకాంత్ ‘ధర్మన్’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. డిసెంబర్ మూడో వారానికే పూర్తి?
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్టిస్ట్.. ఏ2గా అతడి సోదరుడి పేరు చేర్పు
KCR Attender | రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత భరోసా!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

