ATM | నిజామాబాద్‌లో ఏటీఎం చోరీకి యత్నం..! అలారం మోగడంతో పారిపోయిన దుండగుడు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ దుండగుడు బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నించాడు.
వినాయక్ నగర్, నవంబర్, 24 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ దుండగుడు బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నించాడు. స్థానిక దేవీ రోడ్డు పరిధిలో గల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎం సెంటర్ లో కి సోమవారం అర్ధరాత్రి అనంతరం ఒంటి గంట సమయంలో ఓ గుర్తు తెలియని దుండగుడు ఏటీఎంలో చోరీ చేసేందుకు లోనికి ప్రవేశించాడు. ఏటీఎం డోర్ ను చేతితో ధ్వంసం చేసేందుకు యత్నించాడు. అదే సమయంలో ఏటీఎం అలారం మోగడంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే చోరీకి యత్నించిన దుండగుడు అక్కడి నుండి పరారయ్యాడు. దీంతో సదరు దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఏటీఎం సెంటర్లో చోరీకి యత్నించిన దుండగుడు అక్కడ ఉన్న సీసీ కెమెరాకు చిక్కాడు. దాని ఆధారంగా పోలీసు లు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ తో పాటు పరిసర ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై సంబంధిత ఏటీఎం ఇంచార్జ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ATM | నిజామాబాద్‌లో ఏటీఎం చోరీకి యత్నం..! అలారం మోగడంతో పారిపోయిన దుండగుడు
Dharman | రజినీకాంత్ ‘ధర్మన్’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. డిసెంబర్ మూడో వారానికే పూర్తి?
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్టిస్ట్.. ఏ2గా అతడి సోదరుడి పేరు చేర్పు
KCR Attender | రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత భరోసా!
KCR | మణికుమార్ రెడ్డి మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

