KCR Attender | రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత భరోసా!
KCR Attender | KCR Attender | రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద అటెండర్‌గా పనిచేస్తున్న కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి మృతి చెందారు. ఈ ఘటనపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
KCR Attender | రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద అటెండర్‌గా పనిచేస్తున్న కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి మృతి చెందారు. ఈ ఘటనపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ సమీపంలోని హనుమాన్ నగర్ చౌరస్తా వద్ద రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకయ్యకుంట వద్ద బైక్‌ను ఉనుక లారీ ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన భరత్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, రాత్రి 2 గంటల సమయంలో చికిత్స పొందుతూ భరత్ కూడా మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
మణికుమార్ రెడ్డి మృతి వార్త తెలుసుకున్న కేసీఆర్ వెంటనే ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావుతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR Attender | రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత భరోసా!
KCR | మణికుమార్ రెడ్డి మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి
Manoj Bajpayee | ప్రేమ, మానవత్వం ముందు అవి నిలవలేవు.. ప్రోపగాండా సినిమాలపై మనోజ్ బాజ్పేయీ సంచలన వ్యాఖ్యలు.!
Congress | తెలంగాణ నూతన ఏఐసీసీ కార్యదర్శి సందీప్‌తో అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ
Ramayana | ‘రామాయణ’ ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్.. నేడు కేవలం రూ.99కే సినిమా టికెట్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

