Dharman | రజినీకాంత్ ‘ధర్మన్’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. డిసెంబర్ మూడో వారానికే పూర్తి?
Dharman | సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ‘జైలర్ 2’తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఆయన.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘ధర్మన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
Dharman | సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ‘జైలర్ 2’తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఆయన.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘ధర్మన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ‘ధర్మన్’ చిత్రాన్ని మేకర్స్ ఎంతో పక్కా ప్రణాళికతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అనుకున్న షెడ్యూల్స్ ప్రకారమే షూటింగ్ కొనసాగిస్తూ వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని దర్శకుడు అశ్వత్ మారిముత్తు భావిస్తున్నారట. ఈ క్రమంలో డిసెంబర్ మూడో వారానికల్లా మొత్తం షూటింగ్‌ను ముగించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
షూటింగ్ పూర్తయితే మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టేందుకు మేకర్స్‌కు సమయం దొరుకుతుంది. అయితే షూటింగ్ పూర్తి చేసే తేదీపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి ప్రధానంగా సంగీత పనులు మిగిలి ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. రజినీకాంత్ సినిమాలకు అనిరుధ్ అందించే సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. ‘ధర్మన్’ విషయంలోనూ ఆయన నుంచి అదిరిపోయే ఆల్బమ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆశిస్తున్నారు అభిమానులు.ఇటీవలే వివాహం చేసుకున్న అనిరుధ్ కొంత విరామం తర్వాత తిరిగి ఈ సినిమా సంగీత పనుల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎంట్రీతో సినిమా మ్యూజిక్ పనులు మరింత వేగం పుంజుకుంటాయని సమాచారం.
‘ధర్మన్’లో మరో ఆసక్తికరమైన అంశం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రతినాయకుడి పాత్రలో కనిపించనుండటమే. రజినీకాంత్‌కు ఎదురుగా రామ్ విలన్‌గా నటిస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. రామ్‌ను ఇప్పటివరకు చూడని కొత్త అవతారంలో చూపించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ చిత్రంలో శ్రీలీల, రాశిఖన్నా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాణ బాధ్యతలు చేపట్టడం కూడా ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతోంది. రజినీకాంత్‌కు ఉన్న మాస్ ఇమేజ్‌కు, రామ్ పోతినేని ఎనర్జీ తోడైతే తెరపై ఆసక్తికరమైన పోరు చూడొచ్చని అభిమానులు భావిస్తున్నారు. అశ్వత్ మారిముత్తు తనదైన కథనంతో ఈ ఇద్దరు నటులను ఎలా చూపిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ మూడో వారానికే షూటింగ్ పూర్తవుతుందన్న వార్త నిజమైతే.. త్వరలోనే ఈ సినిమా తదుపరి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dharman | రజినీకాంత్ ‘ధర్మన్’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. డిసెంబర్ మూడో వారానికే పూర్తి?
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్టిస్ట్.. ఏ2గా అతడి సోదరుడి పేరు చేర్పు
KCR Attender | రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత భరోసా!
KCR | మణికుమార్ రెడ్డి మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి
Manoj Bajpayee | ప్రేమ, మానవత్వం ముందు అవి నిలవలేవు.. ప్రోపగాండా సినిమాలపై మనోజ్ బాజ్పేయీ సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

