Road Accident | భోగాపురం హైవేపై ఘోర ప్రమాదం.. ట్యాంకర్‌ను ఢీకొన్న థార్, ఐదుగురు మృతి
Road Accident | విజయనగరం జిల్లా భోగాపురం హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. సుందరపేట సమీపంలో తెల్లవారుజామున ఆగి ఉన్న ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన థార్ కారు ఢీకొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Road Accident | విజయనగరం జిల్లా భోగాపురం హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. సుందరపేట సమీపంలో తెల్లవారుజామున ఆగి ఉన్న ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన థార్ కారు ఢీకొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వారంతా శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం ఆలయాన్ని దర్శించుకుని విశాఖ వైపు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
నలుగురు అక్కడికక్కడే మృతి
శ్రీముఖలింగం దర్శనం అనంతరం థార్ కారులో తిరుగు ప్రయాణమైన వారు సుందరపేట సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టారు. ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదంలో మృతిచెందిన వారిని కొండా సూరిబాబు, బొర్రా సతీశ్, ఆయన భార్య శ్రుతి, వాకలపూడి శ్రీను, కుసుమ రంజనిగా గుర్తించారు. వీరిలో వాకలపూడి శ్రీను దంపతులు తగరపువలస ప్రాంతానికి చెందినవారు కాగా, మిగిలిన వారు భీమిలి పరిసరాలకు చెందినవారని సమాచారం. మృతుల్లో రిలయన్స్ డిజిటల్ మేనేజర్ వాకలపూడి శ్రీనివాస్ ఉన్నట్లు తెలిసింది.
అర్ధరాత్రి ప్రయాణం.. ఉదయం ప్రమాదం
ప్రమాదానికి గురైన కారు అర్ధరాత్రి 12.50 గంటలకు శ్రీకాకుళం వైపు వెళ్లినట్లు, తిరుగు ప్రయాణంలో ఉదయం 7.35 గంటలకు భోగాపురం టోల్గేట్ దాటినట్లు రికార్డుల్లో నమోదైంది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. మృతుల వద్ద ఉన్న బ్యాగుల్లో నగదు, విలువైన వస్తువులను అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారును క్రేన్ సాయంతో తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | భోగాపురం హైవేపై ఘోర ప్రమాదం.. ట్యాంకర్‌ను ఢీకొన్న థార్, ఐదుగురు మృతి
Prostate Cancer | ప్రోస్టేట్ క్యాన్సర్ గుర్తింపు, చికిత్సకు కొత్త మార్గదర్శకాలు.. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఏం చెప్పింది..?
Sreejith Ravi | పోక్సో కేసులో మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష.. త్రిసూర్ కోర్టు సంచలన తీర్పు!
ATM | నిజామాబాద్‌లో ఏటీఎం చోరీకి యత్నం..! అలారం మోగడంతో పారిపోయిన దుండగుడు
Dharman | రజినీకాంత్ ‘ధర్మన్’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. డిసెంబర్ మూడో వారానికే పూర్తి?
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

