Y.S. Jagan | మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలి : వైఎస్ జగన్
Y.S. Jagan | కాకినాడ జిల్లా ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులను సురక్షితంగా తీసుకు వచ్చేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
అమరావతి : కాకినాడ జిల్లా ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులను ( Fishermen ) సురక్షితంగా తీసుకు వచ్చేందుకు గాలింపు చర్యలను( Search operations ) ముమ్మరం చేయాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ( Y.S. Jagan ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మత్స్యకార కుటుంబాల ఆవేదనను అర్ధం చేసుకుని గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ సహకారంతో గాలింపు చర్యలను చేపట్టాలని సూచించారు.
మత్స్యకారుల గల్లంతు తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ఈ నెల 4న చేపల వేటకు వెళ్లిన రెండు బోట్లలో ఒకటి తిరిగి రాగా, మరో బోటులోని ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం కలవరపాటుకు గురిచేస్తుందని పేర్కొన్నారు. గల్లంతైన ఆరుగురు మత్స్యకారులను క్షేమంగా తిరిగి తీసుకురావాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని కోరారు.
Also Read :
Boat Missing | ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతు..కుటుంబ సభ్యుల్లో ఆందోళన
Chlorination gas leak | ఎన్టీఆర్ జిల్లాలో క్లోరినేషన్ గ్యాస్ లీక్.. భయాందోళనలో గ్రామస్థులు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Y.S. Jagan | మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలి : వైఎస్ జగన్
Health tips | మీ ఒంట్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే రెగ్యులర్‌గా ఇవి తీసుకోవాలట..!
TTD Insurance | తిరుమల భక్తులకు బీమా పథకం ప్రారంభం.. ఏడుగురికి పరిహారం అందజేత
RS Praveenkumar | మెటా కేసులో ఒక న్యాయం.. ‘మహా’ కేసులో మరో న్యాయం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
టీఏజీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

