Boat Missing | ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతు..కుటుంబ సభ్యుల్లో ఆందోళన
Boat Missing | సముద్రపు వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతు కావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
అమరావతి : సముద్రపు వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల ( Seven Fishermen ) బోటు గల్లంతు ( Boat Missing ) కావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈనెల 11న కాకినాడ జిల్లా యు.కొత్తప్లి మండలం సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. ఈనెల 14 వరకు ఫోన్లో కుటుంబ సభ్యులతో మాట్లాడిన తరువాత ఇప్పటి వరకు వారి సమాచారం తెలియరాలేదు.
గత 13 రోజులుగా వారి ఆచూకీ తెలియాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. కాగా బోటు గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయు డు ఆరా తీశారు. తుపాను కారణంగా ఇతర దేశాల వైపు కొట్టుకెళ్లొచ్చని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. కాగా గల్లంతయిన వారు మయన్మార్ బంగ్లాదేశ్ వైపు వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు
.మత్స్యకారుల సమాచారాన్ని ఆ రెండు దేశాలకు అందజేశామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. మత్స్యకారులను సురక్షితంగా స్వగ్రామాలకు తీసుకొస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కాగా మత్స్యకారుల జాడ కోసం నౌకలు, హెలికాప్టర్ ద్వారా కోస్టల్ సిబ్బంది గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boat Missing | ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతు..కుటుంబ సభ్యుల్లో ఆందోళన
Dhanush | 2027 స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ధనుష్ వ్యూహం.. రాష్ట్రవ్యాప్తంగా సేవా విభాగాల బలోపేతం
గోదావరి తీరంలో కార్తీక వెలుగులు.. పోటెత్తిన భక్తులు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
‘బీమా సౌకర్యంతో జీపీ సిబ్బందికి ఆర్ధిక భద్రత’
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

