Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 28 బంతుల్లో సెంచరీ.. 52 బంతుల్లో డబుల్ సెంచరీ..!
Vaibhav Sooryavanshi | భారత క్రికెట్ జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ లిస్ట్-ఎ క్రికెట్లో సంచలనం సృష్టించాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లోనే శతకం సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. గతంలో జేక్ ఫ్రేజర్ ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో 29 బంతుల్లో సెంచరీ చేశారు. ఆ రికార్డును తాజాగా వైభవ్ బ్రేక్ చేశాడు.
Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) లిస్ట్-ఎ క్రికెట్లో సంచలనం సృష్టించాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లోనే శతకం సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్ (List-A cricket) లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. గతంలో జేక్ ఫ్రేజర్ ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో 29 బంతుల్లో సెంచరీ చేశారు. ఆ రికార్డును తాజాగా వైభవ్ బ్రేక్ చేశాడు.
మొత్తం 250 పరుగుల లక్ష్య ఛేదన కోసం బరిలో దిగిన భారత-ఎ జట్టు వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో కేవలం 14.2 ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది. సూర్యవంశీ ముందుగా 16 బంతుల్లోనే తన అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. ఆ తర్వాత 28 బంతుల్లో సెంచరీని మార్క్ దాటాడు. అలానే 40 బంతుల్లో 150 పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఇక 52 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తిచేశాడు. మొత్తానికి వైభవ్ యూఏఈ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
వైభవ్ మొత్తం 53 బంతుల్లో 204 పరుగులు చేశాడు. అందులో 196 పరుగులు బౌండరీల ద్వారానే రాబట్టాడు. కేవలం 8 పరుగులు మాత్రమే సింగిల్స్ రూపంలో వచ్చాయి. అయితే డబుల్ సెంచరీ తర్వాత తొలి బంతికే వైభవ్ ఔటయ్యాడు. భారత్ సెమీ-ఫైనల్స్‌లో తమ స్థానాన్ని ఖరారు చేసుకోవడానికి భారీ తేడాతో గెలువాలని వేగంగా ఆడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. హర్‌ప్రీత్ సింగ్ భాటియా 144 బంతుల్లో 130 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో అర్షద్ ఖాన్ నాలుగు వికెట్లు సాధించాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 28 బంతుల్లో సెంచరీ.. 52 బంతుల్లో డబుల్ సెంచరీ..!
వెంపటి హత్య కేసులో ఎనిమిది మంది అరెస్ట్
KCR Attender | మణిదీప్ కుమార్ పాడే మోసిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్
ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక
Y.S. Jagan | మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలి : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

