Mukhra (K) | కేసీఆర్ చిత్రపటానికి ముఖ్రా(కె) గ్రామస్థుల పాలాభిషేకం
Mukhra (K) | ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా (కె) గ్రామస్థులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతాభావం తెలిపారు.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా (కె) ( Mukhra villagers ) గ్రామస్థులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతాభావం తెలిపారు. గిరిజన, ఆదివాసీల గూడాలను పంచాయతీలుగా చేసి, 10శాతం రిజర్వేషన్ ( Reservations ) కల్పించిన కేసీఆర్ గిరిజన ఆత్మబంధువని కొనియాడారు. ఈ సందర్భంగా గురువారం ఎడ్లబండిపై కేసీఆర్ చిత్రపటం పెట్టి, భజనలు చేస్తూ ర్యాలీ నిర్వహించి పాలాభిషేకం చేశారు.

స్వతంత్ర భారతంలో ఏ నాయకుడు కూడా చేయని విధంగా తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలుగా మార్చి స్వయంపాలన అందించారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ఆదివాసీల సంక్షేమానికి రూ. 37 వేల కోట్లు ఖర్చు చేశారని, లక్షలాది మందికి పోడు పట్టాలు అందించారని గుర్తుచేశారు. గిరిజనులకు రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచి, వారి సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి అన్ని విధాలా ఆదుకున్న నిజమైన ఆత్మబంధువు కేసీఆర్ అని పేర్కొన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ పేరిట గిరిజనులను మోసం చేసిందని, ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా గిరిజనుల భూములను లాక్కుంటోందని మండిపడ్డారు. గిరిజనులు కేసీఆర్ వెంటే ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, నాయకులు తిరుపతి, నర్సింగ్, జ్ఞానేశ్వర్, తులసీరామ్, రాంకిషన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- adilabad
- BRS chief
- KCR
- kcr portrait
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

