Farmers Protest | చిన్న శంకరంపేట, సెప్టెంబర్ 17 : 24 ఉచిత కరెంట్ ఇస్తామని అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పాలనలో రైతన్నలకు కష్టాలు తప్పడం లేదు. ఎన్నో ఎదురుచూపుల తర్వాత ఆలస్యంగా వచ్చిన వర్షాలతో వేసుకున్న పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. 24 గంటల కరెంట్ అందిస్తామని.. కేవలం 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని, అది నాణ్యమైన కరెంట్ కాదని వాపోతున్నారు. ఇచ్చేది కూడా నాణ్యమైన కరెంట్ కాకపోవడంతో లో వోల్టేజీ, హై వోల్టేజీ సమస్యల కారణంగా మోటార్లు కాలిపోయే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగా రాయి సబ్ స్టేషన్ ముందు రైతులు ధర్నా చేశారు అనంతరం గవ్వలపల్లి వెల్దుర్తి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలు విధించడం వల్ల వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కరెంటు సమస్య రోజురోజుకు తీవ్రమవుతుందన్నారు.
రోజుకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి 8 గంటలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటుకు ఎలాంటి సమస్యలు లేకుండా అందించారని రైతులు గుర్తు చేసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం 24 గంటల కరెంటు అందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని రైతులు హెచ్చరించారు. విషయం తెలుసుకున్న చిన్న శంకరంపేట ఎస్ శివానందం తాసిల్దార్ మాలతి సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించి రాస్తారోకోను విరమింపచేశారు.
పరిగి – మహబూబ్నగర్ రహదారిపై భారీ నిరసన..
మరోవైపు వికారాబాద్ జిల్లాలో కరెంట్ కోసం రైతుల రాస్తారోకో చేపట్టారు. విద్యుత్ సరఫరా సక్రమంగా చేయడం లేదంటూ.. ఆందోళన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదంటూ దోమ మండలం మోత్కూర్ గేటు వద్ద పరిగి – మహబూబ్నగర్ రహదారిపై రైతులు భారీ నిరసన చేపట్టారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేసిన రైతులు కేవలం 7 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని, అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉందని వాపోయారు. రైతుల రాస్తారోకోతో రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

విద్యుత్ కోతలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కుతున్న రైతన్నలు
రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగిన రైతులు
రోజుకు కనీసం 7 గంటల కరెంట్ కూడా ఇవ్వడంలేదని, పంటలు ఎండిపోతున్నాయని… https://t.co/vEYnkaMZuX pic.twitter.com/tlMLAxoFR9
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026
వికారాబాద్ జిల్లాలో కరెంట్ కోసం రైతుల రాస్తారోకో
దోమ మండలం మోత్కూర్ గేటు వద్ద పరిగి – మహబూబ్నగర్ రహదారిపై భారీ నిరసన
విద్యుత్ సరఫరా సక్రమంగా చేయడం లేదంటూ రైతుల ఆందోళన.. హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం
24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్
కేవలం 7 గంటలు మాత్రమే కరెంట్… pic.twitter.com/gyr2ri9JN9
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026