KTR | రేవంత్ రెడ్డి ఎంత చిల్లర మాటలు మాట్లాడుతడంటే.. సిరిసిల్లలో 8000 ఎకరాలు కబ్జా అంటడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. టెస్కాబ్ మాజీ అధ్యక్షుడు కొండూరు రవీందర్ రావుకు పొద్దున్నే ఫోన్ చేశా.. ఏం అంకుల్ ఈయనేదో మాట్లాడుతున్నడు ఏం సంగతి అంటే.. ఆయన్న అన్నదేమంటే.. నేను 2014 తర్వాత ధరణి వచ్చాక ఒక్క గజం భూమి కూడా కొనలేదు, ఒకవేళ కొంటే ఏ శిక్షకంటే ఆ శిక్షకు సిద్ధం. నేనెక్కడ కొన్నా నాకేం సంబంధం.. ధరణి ఎక్కడిది. నేను ఆ భూములు కొనుడెక్కది అని అన్నారు.
మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ తోట ఆగయ్య మాజీ నక్సలైట్ ఒక బలహీన వర్గాల బిడ్డ. 1999లో ఆనాడు నక్సలైట్లలో పనిచేస్తూ అప్పటి ప్రభుత్వ పిలుపు మేరకు లొంగిపోయిండు. ఆ తర్వాత అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం పునరావాసం కింద ఆయనకు మూడున్నర ఎకరాల భూమి కేటాయించింది. మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం 25 ఏండ్ల కింద ఇచ్చిన భూమిని మొన్న గుంజుకున్నది. ఎందుకు గుంజుకున్నడు ఎవరికీ తెల్వదు.. బీఆర్ఎస్ నాయకుడు కావడమే ఆయన చేసిన తప్పు. కేసీఆర్కు మద్దతు పలుకుతూ గట్టిగా ఉద్యమం చేయడమే ఆయన చేసిన తప్పు.
అట్లే భూపాలపల్లిలో కూడా ఏదో జరిగిందన్నడు.. మా మధుసూదనాచారికి కూడా ఇప్పుడే చెప్పిన.. 106 ఎకరాలేదో మేమిచ్చినమన్నడు. ఆ 106 ఎకరాల్లో ప్రొఫెసర్ జయశంకర్ పేరిట మేము ఆ రోజు అక్కడ భూమినిసుప్రీంకోర్టు దాకా పోయి కాపాడి ఎకో పార్క్ పెట్టినం. ఇష్టమొచ్చినట్టు అబద్దాలు చెప్తున్నడు. నిజంగానే సిరిసిల్లలో 8000 ఎకరాలన్నమాట నిజమే అయితే రేవంత్ రెడ్డి.. నేను అడుగుతున్నా ఏ సర్వే నంబర్, ఎవడు కబ్జా పెట్టిండు.. ఎవరు తప్పు చేసిండు.. సిరిసిల్లలోనే లిస్ట్ పెట్టు నేనొద్దంటలేనన్నారు.
రేవంత్ రెడ్డి సిరిసిల్లలో మా వాళ్లు 8000 ఎకరాలు కబ్జా చేశారని చిల్లర వ్యాఖ్యలు చేశాడు
కొండూరు రవీందర్ రావు టెస్కాబ్ మాజీ అధ్యక్షుడు 2014 తర్వాత తాను ఒక్క గజం భూమి కూడా కొనలేదు, తీసుకున్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని అన్నాడు
జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ నక్సలైట్..… https://t.co/PFX8ZjJQBB pic.twitter.com/UvSz8sAfDw
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026