BRICS Summit | బ్రిక్స్ సదస్సుకు హాజరైన ప్రపంచ నేతలు అనారోగ్యం పాలయ్యారా.. ఈ ప్రచారంలో నిజమెంత
BRICS Summit : ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సుకు హాజరైన వివిధ దేశాధినేతల్లో కొందరు అనారోగ్యం పాలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తెలిపింది.
BRICS Summit : ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సు 2026ను ఇండియా విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సదస్సుకు హాజరైన వివిధ దేశాధినేతల్లో కొందరు అనారోగ్యం పాలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తెలిపింది. ఇదంతా తప్పుదోవ పట్టించే ప్రచారం అని ప్రకటించింది. దినిపై ఫ్యాక్ట్ చెక్ పేరిట సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చింది.
సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరిగింది. కొందరు నేతలు సెప్టెంబర్ 11నే ఇండియా వచ్చారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా వంటి నేతలు హాజరయ్యారు. అయితే, ఈ సదస్సు నుంచి తిరిగి వెళ్లిన తర్వాత పలువురు నేతలు అనారోగ్యం పాలయ్యారనే ప్రచారం మొదలైంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా తమ దేశాలు వెళ్లిన తర్వాత ప్రజలకు కనిపించలేదు. అధికారిక కార్యక్రమాల్ని కూడా రద్దు చేసుకున్నారు.
Fake Alert!!! 🚨🚨🚨
We caution against such malicious posts on social media platforms! pic.twitter.com/NRu6Dfk7Yj
— MEA FactCheck (@MEAFactCheck) September 17, 2026
బ్రిక్స్ సదస్సు సమయంలోనే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అనారోగ్యానికి గురయ్యారని, అందుకే ఆయన త్వరగా ప్రత్యేక విమానంలో చైనా వచ్చారని చైనా నేతలు అన్నారు. విమానం దిగిన వెంటనే జిన్పింగ్ మిలిటరీ ఆస్పత్రికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన మాత్రం లేదు. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా అనారోగ్యంపై ఆయన కార్యాలయం ప్రకటన చేసింది. వైద్యుల సూచన మేరకు ఆయన కొంతకాలం అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటారని ప్రకటించింది.
ఇదే సమయంలో కొన్ని అంతర్జాతీయ మీడియా హ్యాండిల్స్ కూడా ఇదే అంశంపై ప్రచారం చేస్తున్నాయి. బ్రిక్స్ సదస్సుకు హాజరైన పలువురు నేతలు అనారోగ్యం పాలయ్యారని ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారంపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. ఇదంతా తప్పుడు ప్రచారమే అని, ఇలాంటి ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వారి అనారోగ్యానికి, బ్రిక్స్ సదస్సుకు సంబంధం లేదని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BRICS summit
- Delhi
- MEA
- Xi Jinping
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

