టేకులపల్లిలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీ మద్దిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి...
టేకులపల్లి, సెప్టెంబర్ 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీ మద్దిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి విశ్వకర్మ భగవానుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. మంతోజు పవన్ కుమార్ చార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. జయంతి వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి విశ్వ బ్రాహ్మణులు తౌడోజు భిక్షమయ్య, ధర్మపురి శ్రీనివాసచారి, చంద్రగిరి రాధాకృష్ణ, కట్టుకోజ్వల సురేష్, వజ్రాల పరిపూర్ణ చారి, చిలకమర్రి రామకృష్ణ, భౌరోజు బిక్షమయ్య, బొడ్డుపల్లి బ్రహ్మచారి, వజ్రాల బ్రహ్మయ్య, నోముల నరేందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

