Oracle Layoffs | ఇవాళే మీ లాస్ట్ వర్కింగ్ డే.. ఉదయం 6 గంటలకే మెయిల్స్ పంపి షాకిచ్చిన ఒరాకిల్
Oracle Layoffs | ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్‌లో మరో సారి ఉద్యోగాల కోత మొదలైంది. లేఆఫ్ జాబితాలో ఉన్న సిబ్బందికి ఉదయం ఆరు గంటల నుంచే లేఆఫ్స్ మెయిల్స్ రావడం మొదలైనట్లు బిజినెస్ ఇన్సైడర్ వెల్లడించింది.
Oracle Layoffs | ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్‌లో మరో సారి ఉద్యోగాల కోత మొదలైంది. లేఆఫ్ జాబితాలో ఉన్న సిబ్బందికి ఉదయం ఆరు గంటల నుంచే లేఆఫ్స్ మెయిల్స్ రావడం మొదలైనట్లు బిజినెస్ ఇన్సైడర్ వెల్లడించింది. కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఈ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు పేర్కొంది.
తాజా లేఆఫ్‌లో ఉద్యోగాలు కోల్పోయిన పలువురు ఉద్యోగులు తమ అనుభవాలను లింక్డ్ఇన్, రెడిట్, బ్లైండ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పంచుకున్నారు. ఈ తాజా రౌండ్లో ప్రభావితమైన ముగ్గురు ఉద్యోగులతో మాట్లాడినట్లు, అంతర్గతంగా ఉద్యోగులకు పంపిన నోటిఫికేషన్‌ను పరిశీలించినట్లు బిజినెస్ ఇన్సైడర్ తెలిపింది. అయితే తాజా లేఆఫ్స్‌లో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే విషయాన్ని ఒరాకిల్ అధికారికంగా వెల్లడించలేదు.
‘ఇవాళే మీ లాస్ట్ వర్కింగ్ డే’
ఇవాళ ఉదయం 6 గంటల నుంచే ఉద్యోగులకు ఒరాకిల్ సంస్థ మెయిల్స్ పంపడం ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపింది. “Today is your last working day” అంటూ ఆ మెయిల్స్ ప్రారంభమైనట్లు ఉద్యోగులు తెలిపారు. ఒరాకిల్ ప్రస్తుత వ్యాపార అవసరాలను పరిగణనలోకి తీసుకుని సంస్థలో విస్తృత పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నామని, అందులో భాగంగా సంబంధిత ఉద్యోగుల పోస్టులను తొలగించినట్లు ఈమెయిల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఉద్యోగి పనితీరు లేదా వ్యక్తిగత కారణాలను ప్రస్తావించకుండా.. “Oracle’s current business needs” ఆధారంగా ఉద్యోగాన్ని తొలగిస్తున్నట్లు మెయిల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు వారి సేవలకు, కృషికి కృతజ్ఞతలు తెలిపిన అనంతరం.. టెర్మినేషన్ పత్రాలపై సంతకం చేసిన తర్వాత కంపెనీ సెవరెన్స్ ప్లాన్ నిబంధనలకు లోబడి పరిహారం అందుతుందని వివరించినట్లు సమాచారం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

