Khammam Houses | ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలు ఎంతో కష్టపడి కట్టుకున్నఇళ్లను రేవంత్ ప్రభుత్వం బుల్డోజర్లతో నేలమట్టం చేసి కర్కశంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సర్కార్ చర్యలతో భూదాన్ భూముల్లో ఇండ్లను కోల్పోయిన పేదలు నిర్ధాక్షిణ్యంగా రోడ్డున పడ్డారు. ఈ ఘటన మరువక ముందే రేవంత్ సర్కార్ ఖమ్మంలో మరోసారి పేదల ఇళ్లపై పంజా విసిరింది.
అధికారులు పేదల ఇళ్ల కూల్చివేతకు నోటీసులు ఇచ్చారు. దీంతో బాధితులు రోడ్డెక్కారు. శ్రీనివాసనగర్‌లో పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తామంటూ మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బాధితులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఇళ్ల కూల్చివేత నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బాధితులు ఆందోళన చేపట్టారు. పేదల ఇళ్ల కూల్చివేతలపై రేవంత్ ప్రభుత్వం చూపిస్తున్న అత్యుత్సాహం ఎలా ఉందో మరోసారి ఈ వీడియో చెప్పకనే చెబుతోంది.
ఖమ్మంలో మరోసారి పేదల ఇళ్లపై రేవంత్ పంజా
పేదల ఇళ్ల కూల్చివేతకు నోటీసులు ఇచ్చిన అధికారులు.. రోడ్డెక్కిన బాధితులు
శ్రీనివాసనగర్‌లో పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తామంటూ మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రోడ్డుపై ధర్నాకు దిగిన బాధితులు
ఇళ్ల కూల్చివేత నోటీసులను… pic.twitter.com/9zrEOpSYHt
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026