నాగర్ కర్నూల్ : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అమరుల త్యాగాలు ( Sacrifices Martyrs ) మరువలేనివని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy ) అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ( BRS ) పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి , తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులు అర్పించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సెప్టెంబర్ 17న తెలంగాణ చరిత్రలో ప్రజాస్వామ్య విలువలకు, స్వేచ్ఛకు కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితమే నేటి ప్రజాస్వామ్య తెలంగాణ అని పేర్కొన్నారు. చరిత్రను రాజకీయ లాభాల కోసం వాడుకోకుండా, అమరుల త్యాగాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వివరించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధన ఉద్యమం కూడా ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. అమరుల త్యాగాలు , వాఆశయాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేయడమే వారికి నిజమైన నివాళి అని వెల్లడించారు.