Watch: అధికారి బల్లపై వీధి కుక్కలను వదిలిన యువసేన నేతలు.. తర్వాత ఏం జరిగిందంటే?
Yuva Sena Workers Release Stray Dogs | వీధి కుక్కల సమస్య గురించి అధికారి పట్టించుకోకపోవడంతో యువసేన నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. వీధి కుక్కలను పట్టి సంచుల్లో తెచ్చి అధికారి బల్లపై వాటిని వదిలేరు. ఇది చూసి ఆ అధికారి షాక్ అయ్యారు.
ముంబై: వీధి కుక్కల సమస్య గురించి అధికారి పట్టించుకోకపోవడంతో యువసేన నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. వీధి కుక్కలను పట్టి సంచుల్లో తెచ్చి అధికారి బల్లపై వాటిని వదిలేరు. ఇది చూసి ఆ అధికారి షాక్ అయ్యారు. అలాగే ఆయన మెడలో నోట్ల దండలు వేసేందుకు యువసేన నేతలు ప్రయత్నించారు. (Yuva Sena Workers Release Stray Dogs) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 15న ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కు చెందిన యువసేన కార్యకర్తలు నిఫాద్ నగర్ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. యువసేన జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రంధవే ఒక సంచిని విప్పారు. అందులో ఉన్న చిన్న కుక్కను అధికారి ధీరజ్ భమ్రే టేబుల్‌పై వదిలారు. షాకైన ఆ అధికారి తన కుర్చీ నుంచి లేచి వెనక్కి జరిగారు.
కాగా, మరో సంచిలో తెచ్చిన వీధి కుక్కను కూడా ఆ అధికారి బల్లపై విక్రమ్ వదిలారు. అది భయంతో ఆ టేబుల్‌పై ఒక మూలలో కూర్చొన్నది. ఆ తర్వాత తన బృందంతో కలిసి రూ.20 నోట్లతో చేసిన దండలను అధికారి ధీరజ్ మెడలో వేసేందుకు విక్రమ్ ప్రయత్నించారు. అయితే ఆ కార్యాలయంలోని కొందరు అధికారులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ వాగ్వాదం జరిగింది. పంచాయతీ కార్యాలయం సిబ్బంది ఆ కుక్కలను బయటకు తీసుకెళ్లారు.
మరోవైపు గత ఆరు నెలలుగా వీధి కుక్కల సమస్య గురించి అధికారి దీరజ్ దృష్టికి పలుసార్లు తీసుకెళ్లినప్పటికీ ఆయన పట్టించుకోలేని యువసేన జిల్లా అధ్యక్షుడు విక్రమ్ ఆరోపించారు. అందుకే యువసేన కార్యకర్తలు ఈ విధంగా నిరసన తెలిపినట్లు చెప్పారు. ‘గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రజలు హారతి కోసం వెళ్తున్నప్పుడు కుక్కలు వెంబడిస్తున్నాయి. చిన్న పిల్లలను అవి కరుస్తున్నాయి. వీధి కుక్కల వల్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు’ అని విక్రమ్ అన్నారు. ఎనిమిది రోజుల్లోగా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఆ అధికారి కార్యాయంలోకి మరిన్ని వీధి కుక్కలను వదులుతామని ఆయన హెచ్చరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Nashik – Yuva Sena district chief Vikram Randhave led an aggressive protest against the functioning of the Niphad Nagar Panchayat, drawing attention to the rising stray dog menace in the town. Randhave released four to five stray dogs inside the office of Chief Officer Dhiraj… pic.twitter.com/QhRXxl9BOe
— NextMinute News (@nextminutenews7) September 16, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- nashik
- official
- Release
- Stray dogs
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

