నల్గొండ : 2027 మార్చిలో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ( MLC elections) నియోజకవర్గాలకు ఖాళీలు ఏర్పడనున్న నేపథ్యంలో కొత్తగా ఓటర్ల జాబితా ( Voters list ) సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం( Election Commission) ఆదేశాలు జారీ చేసింది.
ఈనెల 28న ఓటర్ల జాబితా ప్రక్రియపై ప్రజా నోటీసు, అక్టోబర్ 15న పత్రికల్లో తొలి పునఃప్రచురణ, అక్టోబర్ 25న రెండో పునఃప్రచురణ, నవంబర్ 6 న ఫారం-18 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అని వెల్లడించింది.
నవంబర్ 20న ముసాయిదా ఓటర్ల జాబితా ముద్రణ పూర్తి, నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ , డిసెంబర్ 25న క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం పూర్తి,
డిసెంబర్ 30 తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని స్పష్టం చేసింది.
ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు కూడా కొత్తగా మార్చిన ఫారం-18లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువపత్రాలు, సర్టిఫికెట్ల ధృవీకరించిన కాపీలను సమర్పించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.