Abhishek Sharma | సిక్సర్లతో హోరెత్తిస్తున్న అభిషేక్.. 9వేల క్లబ్లో శాంసన్..!
Abhishek Sharma : మూడు టీ20ల సిరీస్లో దంచేస్తున్న అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన ఉగ్రరూపాన్ని చూపించాడు. మూడో టీ20లో అఫ్గనిస్థాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ మెరుపు అర్ధ శతకం సాధించాడీ హిట్టర్.
Abhishek Sharma : మూడు టీ20ల సిరీస్లో దంచేస్తున్న అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన ఉగ్రరూపాన్ని చూపించాడు. మూడో టీ20లో అఫ్గనిస్థాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ మెరుపు అర్ధ శతకం సాధించాడీ హిట్టర్. కేవలం 16 బంతుల్లోనే యాభై రన్స్ కొట్టేశాడు అభిషేక్. సుడిగాలిలా విరుచుకుపడిన ఈ లెఫ్ట్ హ్యాండర్కు పొట్టి క్రికెట్లో ఇది పదమూడో హాఫ్ సెంచరీ.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అభిషేక్ శర్మ(93 నాటౌట్ : 28 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లు) కేక పుట్టించాడు. నామమాత్రమైన మూడో టీ20లో అఫ్గనిస్థాన్ బౌలర్లపై పిడుగల్లే విరుచుకుపడిన ఈ చిచ్చరపిడుగు 16 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. పొట్టి క్రికెట్లో తన స్టయిల్ విధ్వంసంతో కాబూలీ బౌలింగ్ దళాన్ని చీల్చిచెండాడిన అభిషేక్.. ఈ ఫార్మాట్లో 13వ ఫిఫ్టీ నమోదు చేశాడు.
Rollicking 1⃣6⃣-ball FIFTY 🔥
Abhishek Sharma’s 1⃣3⃣th in T20Is 👏
50-run partnership also up for the openers 🤝
Updates ▶️ https://t.co/Zixki4RhPt#TeamIndia | #AFGvIND pic.twitter.com/qXQYnnCl3K
— BCCI (@BCCI) September 17, 2026
టీ20ల్లో భారత్ తరఫున ఐదో వేగవంతమన హాఫ్ సెంచరీ ఇది. ఇదే ఏడాది న్యూజిలాండ్పై గువాహటిలో.. 14 బంతుల్లోనే యాభైతో అభిషేక్ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. మరో ఎండ్లో సంజూ శాంసన్(31 నాటౌట్) సైతం ధనాధన్ ఆటతో 9,000 పరుగుల క్లబ్లో చేరాడు. వీరిద్దరి బాదుడుకు ఆరు ఓవర్లకే టీమిండియా స్కోర్ వంద దాటింది. 8 ఓవర్లకు స్కోర్.. 124/0.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

