Deaths In Manipur Relief Camps | మణిపూర్ సహాయ శిబిరాల్లో 25 మంది మృతి.. నివేదిక కోరిన సుప్రీంకోర్టు
Deaths In Manipur Relief Camps | మణిపూర్‌లోని సహాయ శిబిరాల్లో తలదాచుకున్న ప్రజలు అసాధారణంగా చనిపోతున్నారు. తాజాగా 25 మంది మరణించడం కలకలం రేపింది. దీనిపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే చాలా తక్కువగా పరిహారం ఇవ్వడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
ఇంఫాల్: మణిపూర్‌లోని సహాయ శిబిరాల్లో తలదాచుకున్న ప్రజలు అసాధారణంగా చనిపోతున్నారు. తాజాగా 25 మంది మరణించడం కలకలం రేపింది. దీనిపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే చాలా తక్కువగా పరిహారం ఇవ్వడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. (Deaths In Manipur Relief Camps) మణిపూర్‌లో 2023లో జరిగిన జాతి హింసాకాండలో వందలాది మంది మరణించగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ సహాయ శిబిరాల్లో వారు తలదాచుకున్నారు. అయితే సహాయక శిబిరాల్లో నివసించే ప్రజలు అసాధారణంగా చనిపోతున్నారు. తాజాగా 25 మంది మరణించడం ఆందోళన రేపింది. ఇది సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది.
కాగా, మణిపూర్‌లో జాతి హింసాకాండపై దర్యాప్తు , మహిళలపై లైంగిక దాడులు, రక్షణ, సహాయం, పునరావాసానికి సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. సహాయక శిబిరాల్లో 25 అసాధారణ మరణాలపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జయమాల్య బాగ్చి, వీ మోహనలతో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. సమగ్ర నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. శిబిరాల్లో మరణాలకు దారితీసిన పరిస్థితుల వివరాలు, పోస్ట్‌మార్టం నివేదికలు, శిబిరాలలో నివసిస్తున్న నిర్వాసితుల రక్షణకు తీసుకున్న చర్యలను కోర్టు కోరింది.
మరోవైపు మణిపూర్ వ్యాప్తంగా సహాయక శిబిరాల్లో నమోదైన మరణాలపై పరస్పర విరుద్ధమైన గణాంకాలు సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి. ఎనిమిది జిల్లాల్లో 640 మరణాలు సంభవించినట్లు ఒక నివేదిక పేర్కొంది. ఒక ఐఏఎస్ అధికారి ఇచ్చిన మరో నివేదికలో శిబిరాల్లో 608 మరణాలు సంభవించినట్లు ఉన్నది.
అయితే కేవలం 20 కేసుల్లో మాత్రమే పోస్ట్‌మార్టం పరీక్షలు నిర్వహించినట్లు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దీంతో అసహజ మరణాలన్నిటికి పోస్ట్‌మార్టం పరీక్షలు ఎందుకు నిర్వహించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది.
అలాగే అసహజ మరణాల కేసుల్లో కేవలం రూ. 20,000 నుంచి రూ. 30,000 మాత్రమే పరిహారం చెల్లింస్తున్నట్లు వచ్చిన వార్తలపై కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసహజ మరణాలన్నింటిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చూడాలని మణిపూర్ న్యాయ సేవల అథారిటీని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Manipur
- relief camps
- Report
- Seeks
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

