రాంచి: జార్ఖండ్లో పేపర్ లీక్ వ్యతిరేక నిరసనల సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరాపై సిరా దాడి జరిగింది. శుక్రవారం రాంచీలోని జార్ఖండ్ అసెంబ్లీ వైపుగా విద్యార్థులతో కలిసి నిరసన ర్యాలీగా వెళ్తున్న ఆమెపై ఒక వ్యక్తి ఇంకు పోశాడు. (Ink attack on AISA chief Neha Bora) నేహా బోరా ‘దేశద్రోహి’ అని అతడు ఆరోపించాడు. ‘నేహా బోరా ఉమర్ ఖలీద్ మద్దతుదారురాలు. ఆమె అంటే ఇష్టం నాకు లేదు. ఆమె దేశ వ్యతిరేకి’ అని మీడియాతో అన్నాడు. అక్కడి నుంచి పారిపోతున్న ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
కాగా, ఈ దాడికి తాను భయపడబోనని నేహా బోరా అన్నారు. తనపై సిరా పోసిన ఆ వ్యక్తి బీజేపీ మద్దతు ఉన్న గూండా అని ఆమె ఆరోపించారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలను రద్దు చేయాలని, తక్షణమే తిరిగి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఈ ర్యాలీలో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. ‘ఢిల్లీ నిరసనల సమయంలో పెల్లెట్ గన్ కాల్పులు, లాఠీచార్జిని ఎదుర్కొన్న నాకు, సిరా చల్లడం వల్ల భయం కలగదు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువత ఆగ్రహాన్ని సిరాతో అణచివేయగలమని వారు భావిస్తున్నారా?’ అని ఆమె ప్రశ్నించారు.
For those who wanted a closer view of how ink was thrown at AISA’s fraud Neha Bora, here’s the video.
The ink was thrown straight at her face 😂👇 pic.twitter.com/hZcrkHRDZo
— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) August 7, 2026
#Breaking -Man throws ink at AISA National President Neha Bora during Jharkhand student protest pic.twitter.com/YIknr6VLqw
— NEWS WALA (@NEWSWALApy) August 7, 2026
🚨Man Who Threw Ink at AISA National President Neha Bora Taken Into Police Custody pic.twitter.com/vmKiI5eMrD
— The Tatva (@thetatvaindia) August 7, 2026