హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నగారా మోగింది. ఆర్టీసీ లో మెజారిటీ కార్మిక సంఘాన్ని తేల్చేందు కు ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ తెలంగాణ లేబర్ జాయింట్ కమిషనర్ శుక్రవా రం షెడ్యూల్ ప్రకటించారు. అక్టోబర్ 9న రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.
22న డిపో మేనేజర్ల ద్వారా ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లాల డిప్యూటీ రిటర్నింగ్ అధికారులకు సమర్పించడం, సంఘాల నుంచి అభ్యంతరాలు కోరడం, 24న డిప్యూటీ రిటర్నింగ్ అధికారుల వద్ద అభ్యంతరాల దాఖ లు, 25న అభ్యంతరాల పరిషారం, తుది ఓటర్ల జాబితా ఖరారు, 26న పోటీ చేసే సంఘాలకు తుది ఓటర్ల జాబితా అందజేత, గుర్తుల కేటాయింపు, 29న సంఘాలు డి ప్యూటీ రిటర్నింగ్ అధికారుల నుంచి డమ్మీ బ్యాలెట్ పత్రాలను సేకరించడం, అక్టోబర్ 9న ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటాయి. అక్టోబర్ 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 17న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.